Telugu Global
Telangana

బీజేపీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే దిక్కా?

శామీర్‌పేటలో జరిగిన పార్టీ జాయినింగ్ కమిటీ మీటింగ్‌లో పై రెండు పార్టీల్లోని అసంతృప్తులను ఆకర్షించాలని బండి సంజయ్ డిసైడ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున బలమైన అభ్యర్ధులను రంగంలోకి దింపాలంటే అందుకు పై రెండు పార్టీల్లోని అసంతృప్త నేతలే దిక్కని మీటింగు తేల్చేసింది.

Bandi Sanjay Kumar
X

బండి సంజయ్

హెడ్డింగ్ చూసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరంలేదు. బీజేపీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే దిక్కంటే అభ్యర్ధుల పోటీకి సంబంధించి మాత్రమే. ఎందుకంటే శామీర్‌పేటలో జరిగిన పార్టీ జాయినింగ్ కమిటీ మీటింగ్‌లో పై రెండు పార్టీల్లోని అసంతృప్తులను ఆకర్షించాలని బండి సంజయ్ డిసైడ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున బలమైన అభ్యర్ధులను రంగంలోకి దింపాలంటే అందుకు పై రెండు పార్టీల్లోని అసంతృప్త నేతలే దిక్కని మీటింగు తేల్చేసింది.

మీటింగులో చర్చను గమనిస్తే సుమారు 40 నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉందని అర్దమైంది. పార్టీ నేతలు 40 నియోజకవర్గాల్లో బలహీనంగా ఉందని చెప్పుకుంటున్నారు కానీ క్షేత్రస్ధాయిలో చూస్తే దాదాపు 70 నియోజకవర్గాల్లో పార్టీ బాగా బలహీనంగా ఉందట. సో, ఆ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను పోటీలోకి దింపాలంటే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని బలమైన నేతలు, తీవ్ర అసంతృప్తిలో ఉన్న నేతలు, టికెట్లు దక్కదనే అనుమానం ఉన్న నేతలే దిక్కని తేలిపోయింది.

ఇందుకనే తాజా మీటింగులో పై రెండు పార్టీల్లోని అసంతృప్త నేతలకు గాలమేయాని బండి డిసైడ్ చేశారు. ఇతర పార్టీల నుండి వచ్చే నేతల విషయంలో పార్టీలోని నేతలు ఎవరు కూడా అడ్డుపడకూడదని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇతర పార్టీల్లో గట్టి నేతలను నేరుగా ఢిల్లీకి తీసుకొచ్చి అగ్రనేతలతో భేటీ ఫిక్స్ చేయించాలని ఢిల్లీలోని పార్టీ పెద్దలు ఆదేశాలిచ్చినట్లు మీటింగులో బండి చెప్పారు.

దీని బట్టే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి లాక్కునే విషయంలో బండి సంజయ్ ఎంత ఆతృతగా ఉన్నారో అర్ధమైపోతోంది. ఈ మధ్యనే పార్టీ ఇన్‌చార్జ్‌ తరుణ్ చుగ్ చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 90 సీట్లు గ్యారెంటీ అన్నది నిజమైతే ఇరత పార్టీల నేతలకు గాలమెందుకు వేస్తున్నట్లు? పైగా పై రెండు పార్టీల్లోని అసంతృప్తులను గుర్తించి గాలమేసి పట్టుకోవాలని అధిష్టానం ఆదేశించిందట. దీన్నిబట్టే అర్ధమైపోతోంది బీజేపీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే దిక్కని.

First Published:  29 Dec 2022 12:53 PM IST
Next Story