ఆ నలుగురు అభ్యర్థులకు బీజేపీ షాక్.. పెండింగ్‌లో బీఫామ్
ప్రధానంగా పెద్దపల్లి అభ్యర్థిని మారుస్తారని తెలుస్తోంది. ప్రచారంలో పెద్దగా యాక్టివ్‌గా లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పలువురు అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు సైతం దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఈటల, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, డి.కె.అరుణ లాంటి ప్రముఖ నేతలంతా నామినేషన్లు ఫైల్ చేశారు.
అయితే మిగిలినవారిలో నలుగురు అభ్యర్థుల బీఫామ్‌లు బీజేపీ పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నలుగురిలో ఇద్దరు అభ్యర్థుల మార్పు ఖాయమని ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం బీఫామ్‌లు పెండింగ్ పెట్టిన లిస్టులో హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత, మహబూబాబాద్ అభ్యర్థి సీతారాంనాయక్, నల్గొండ అభ్యర్థి సైదిరెడ్డి, పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఉన్నారని సమాచారం.
ప్రధానంగా పెద్దపల్లి అభ్యర్థిని మారుస్తారని తెలుస్తోంది. ప్రచారంలో పెద్దగా యాక్టివ్‌గా లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేష్ బీజేపీలో చేరితే ఆయనకు టికెట్ ఇచ్చే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. ఇక నల్గొండలోనూ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన తేరా చిన్నపరెడ్డి బీజేపీలో చేరితే ఆయన అభ్యర్థిత్వం ఖాయం చేస్తారని ప్రచారం జరుగుతోంది.