రాహుల్ గాంధీ పెళ్లి..!! రఘునందన్ రావు రచ్చ
రాహుల్ వ్యవహారాన్ని రఘునందన్ రావు ఓ పట్టాన వదిలేలా రేరు. నేరుగా సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ఆయన బ్లిట్జ్ పత్రిక కాపీలను అందజేశారు.
రాహుల్ గాంధీకి పెళ్లి జరిగిందని, ఆయన భార్య, వారి వివాహం వివరాలన్నిటినీ బ్లిట్జ్ అనే పత్రికలో అచ్చువేశారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు రచ్చ చేస్తున్నారు. ఆ విషయంపై రాహుల్ గాంధీ స్పందించాల్సిందేనని ఆయన డిమాండ్ చేస్తున్నారు. వాస్తవంగా ఇలాంటి ఆరోపణలు వినపడితే, బీజేపీ జాతీయ స్థాయి నేతలు విమర్శలతో విరుచుకు పడేందుకు ముందుంటారు, కానీ ఈసారి వారెవరూ ఆసక్తి చూపించకపోవడం, రఘునందన్ రావు ఆ విషయాన్ని హైలైట్ చేయాలని చూడటం విశేషం.
ఒప్పుకుంటారా, లేదా..?
రాహుల్ గాంధీ తనకి పెళ్లయిందని కానీ, కాలేదని కానీ ఎక్కడా చెప్పలేదు. ఇదిగో ఫలానా పేపర్లో మీకు పెళ్లయిందని వార్త వచ్చింది, దానికి మీ వివరణ ఏంటి..? అని అడగడం కరెక్టేనా అని అంటున్నారు నెటిజన్లు. అయితే రఘునందన్ రావు మాత్రం తన వాదనను సమర్థించుకుంటున్నారు. విదేశీ మీడియా సంస్థ హిండెన్ బర్గ్.. అదానీ సంస్థలపై ఆరోపణలు చేస్తే వాటిని రాహుల్ గాంధీ సమర్థించారని, అదే సమయంలో మరో విదేశీ మీడియా సంస్థ అయిన బ్లిట్జ్ కథనంపై ఆయన ఎందుకు స్పందించరని నిలదీశారు.
విదేశీ మీడియా సంస్థ అయిన హిండెన్‌బర్గ్ ఆరోపణలను సమర్ధించిన రాహుల్ గాంధీ..
— BJP Telangana (@BJP4Telangana) August 22, 2024
మరో విదేశీ మీడియా సంస్థ అయిన బ్లిట్జ్ కథనాన్ని కూడా సమర్థిస్తారా?
- శ్రీ @RaghunandanraoM గారు, మెదక్ ఎంపీ pic.twitter.com/Yk3l5sG0sE
తగ్గేదే లేదు..
రాహుల్ వ్యవహారాన్ని రఘునందన్ రావు ఓ పట్టాన వదిలేలా రేరు. నేరుగా సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ఆయన బ్లిట్జ్ పత్రిక కాపీలను అందజేశారు. రాహుల్ వ్యక్తిగత సిబ్బందికి ఆ పత్రికని అందించారు. అది రాహుల్ కి అందజేయాలని సూచించారు. రాహుల్ పెళ్లి సంగతేమో కానీ, రఘునందన్ రావు రచ్చ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Visited the residence of @RahulGandhi and handed over copies of Blitz magazine to his staff. pic.twitter.com/pYPveUfkKh
— Raghunandan Rao Madhavaneni (@RaghunandanraoM) August 23, 2024