ఆ నాలుగు పట్టణాల పేర్లు మార్చండి.. టీ.బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్
హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలని బీజేపీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. గతంలో హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంగా పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు ఈ డిమాండ్‌ను వినిపించారు.
తెలంగాణలో ఇప్పుడు పేర్ల మార్పుపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం వాహనాల రిజిస్ట్రేషన్‌ను TS నుంచి TGగా మార్చుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు చేస్తామని రేవంత్ సర్కార్ చెప్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలోని పలు నగరాల పేర్లు మారుస్తామని బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రభుత్వం ముందు మరో డిమాండ్ పెట్టారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా, నిజామాబాద్ పేరును ఇందూరుగా, ఆదిలాబాద్ పేరును ఏదులాపురంగా, వరంగల్ పేరును ఓరుగల్లుగా మార్చాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలని బీజేపీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. గతంలో హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంగా పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు ఈ డిమాండ్‌ను వినిపించారు. మరీ తాజాగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా చేసిన డిమాండ్‌పై రేవంత్ సర్కార్ ఎలా స్పందిస్తునదే వేచి చూడాల్సి ఉంది.