Telugu Global
Telangana

అప్పుడే రచ్చ మొదలుపెట్టిన బీజేపీ నాయకులు

మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు రచ్చ మొదలుపెట్టారు. ఎన్నికల అధికారులు టీఆరెస్ కు అనుకూలంగా వ్యవ‌హరిస్తున్నారని కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఆరోపించారు.

అప్పుడే రచ్చ మొదలుపెట్టిన బీజేపీ నాయకులు
X

మునుగోడు ఎన్నికల ఓట్ల లెక్కింపు లో ఫలితాలు పోటాపోటీగా వస్తున్నాయి. ఎవరు గెలుస్తారో చెప్ప‌డం కష్టంగా ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ ఐదో రౌండ్ పూర్తయ్యేసరికి టీఆరెస్ ఆధిక్యంలో ఉంది. అయితే మధ్యలో అధికారులు ఇచ్చిన టీ బ్రేక్ వల్ల కొన్ని రౌండ్ ల ఫలితం ప్రకటించడం లేటయ్యింది.

ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు రచ్చ మొదలు పెట్టారు. ఎన్నికల అధికారులు అనుమానాస్పదంగా వ్యవ‌హరిస్తున్నారని, టీఆరెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏకంగా ఎన్నికల ప్రధాన అధికారికి ఫోన్ చేసి ఫలితాలు ప్రకటించడంలో అధికారుల వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. అధికారులు ఇలాగే వ్యవహరిస్తే సెంట్రల్ ఎన్నిక ప్రధాన అధికారికి పిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. బీజేపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఎన్నికల అధికారులపై మండిపడ్డారు. టీఆరెస్ కు అధికారులు మద్దతుగా ఉంటున్నారని, ఫలితాలు సరిగా రాకపోతే తాము చూస్తూ ఊరుకోబోమని సంజయ్ హెచ్చరించారు.

First Published:  6 Nov 2022 11:32 AM IST
Next Story