బీజేపీలో చిచ్చుపెట్టిన జనసేన..!
శేరిలింగంపల్లి టికెట్ జనసేనకు ఇస్తే తన దారి తాను చూసుకుంటానని బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రవి కుమార్ యాదవ్‌కే శేరిలింగంపల్లి టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు.
జనసేనతో పొత్తు తెలంగాణ బీజేపీలో చిచ్చుపెట్టింది. పొత్తు కారణంగా తమకు మొండిచెయ్యి చూపుతారని పలువురు బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాలు జనసేనకు ఇస్తారన్న ప్రచారంతో స్థానిక నేతలు ఆందోళనలు, నిరసనలకు దిగుతున్నారు.
శేరిలింగంపల్లి టికెట్ జనసేనకు ఇస్తే తన దారి తాను చూసుకుంటానని బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రవి కుమార్ యాదవ్‌కే శేరిలింగంపల్లి టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. మరోవైపు కూకట్‌పల్లి బీజేపీ నేతలు సైతం ఆ సీటును జనసేనకు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలకు సైతం సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకూ 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలకమైన శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి స్థానాలను పెండింగ్‌లోనే ఉంచింది.
ఇక జనసేన పొత్తుపై ఎటు తేలకపోవడంతో మొత్తంగా 31 స్థానాలను పెండింగ్‌లో ఉంచింది బీజేపీ. దీంతో ఆయా స్థానాల్లోని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ ఇటలీ టూర్‌లో ఉండటంతో పొత్తుపై చర్చలు సాగట్లేదు. పవన్ ఇటలీ నుంచి వచ్చిన తర్వాతే మిగిలిన సీట్లపై క్లారిటీ రానుంది. మరోవైపు జనసేన 20-25 సీట్లు అడుగుతోందని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకు కేటాయించే స్థానాలపై ఉత్కంఠ నెలకొంది.