Telugu Global
Telangana

మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతల నిద్ర నేడు

సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు అక్కడే బస

మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతల నిద్ర నేడు
X

మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు నేడు రాత్రి నిద్ర చేయనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు అక్కడే బస చేయనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తూ మొత్తం 20 బస్తీల్లో 20 మంది నేతలు భాగస్వామ్యం కానున్నారు. రాత్రి భోజనం, నిద్రతో పాటు మరుసటి రోజు ఉదయం టిఫిన్‌ అక్కడే చేనున్నారు. ఆయా బస్తీల్లో పేదలు పడుతున్న ఇబ్బందులను బీజేపీ నేతలు తెలుసుకోనున్నారు.

మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దంటూ బీజేపీ ఇప్పటికే ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. మూసీ ప్రభావిత ప్రాంతాల్లో నేతలు పర్యటించారు. 9 బృందాలు 18 ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకున్నాయి. మూసీ ప్రక్షాళలను విపక్షాలు అడ్డుకుంటున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మూసీ ప్రక్షాళనను వ్యతిరేకించే మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తే తెలుస్తందని, అక్కడి ప్రజల బాధలు తెలుస్తాయని సీఎం సవాల్‌ విసిరారు. రేవంత్‌ సవాల్‌ను స్వీకరించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం నేడు మూసీ పరివాహక ప్రాంతాల్లోని 20 చోట్ల 20 మంది ముఖ్యనేతలు బస చేయనున్నారు.

First Published:  16 Nov 2024 9:41 AM IST
Next Story