Telugu Global
Telangana

సూట్ కేసులు తెస్తేనే టికెట్లు.. రఘునందన్ వ్యాఖ్యల కలకలం

రఘునందన్ వ్యాఖ్యలు ఆయన సొంత పార్టీకి వర్తించవా అని కౌంటర్లు పడుతున్నాయి. సూట్ కేసు వ్యాఖ్యలు చేసే అర్హత బీజేపీ నేతగా రఘునందన్ కి లేదని అంటున్నారు నెటిజన్లు.

సూట్ కేసులు తెస్తేనే టికెట్లు.. రఘునందన్ వ్యాఖ్యల కలకలం
X

సూట్ కేసులు తెచ్చిన వారికే బీఆర్ఎస్ పార్టీ మెదక్ సీటు ఇచ్చిందని విమర్శించారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ కు మెదక్ లో స్థానిక అభ్యర్థి దొరక్కపోవడం విడ్డూరం అన్నారాయన. మెదక్ సీటుని ఇతర ప్రాంతాలవారికి అమ్ముకున్నారని, సూట్ కేసులు ఇస్తేనే టికెట్ ఇస్తున్నారని ఆరోపించారు. అయితే రఘునందన్ వ్యాఖ్యలు ఆయన సొంత పార్టీకి వర్తించవా అని కౌంటర్లు పడుతున్నాయి. సూట్ కేసు వ్యాఖ్యలు చేసే అర్హత బీజేపీ నేతగా రఘునందన్ కి లేదని అంటున్నారు నెటిజన్లు.

తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీఎస్పీ నేత బీఆర్ఎస్ లో చేరి టికెట్ సాధించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరి టికెట్ తెచ్చుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో చేరి టికెట్లు సాధించారు. అంటే అన్ని పార్టీలనుంచి వలస నేతలకు ప్రాధాన్యముంది. మరి ప్రత్యేకించి బీఆర్ఎస్ అభ్యర్థిని బీజేపీ అభ్యర్థి టార్గెట్ చేయడాన్ని ఏమనాలి. ఈ గురివింద నీతి ఏంటని రఘునందన్ రావుపై నెటిజన్లు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఆల్రడీ ట్రోలింగ్ మొదలైంది. ఎన్ని సూట్ కేసులు తెస్తే బీఆర్ఎస్ ఎంపీలకు బీజేపీలో టికెట్లు ఖరారయ్యాయని ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి అభ్యర్థులే కరువయ్యారా అని నిలదీస్తున్నారు.

మెదక్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ ఖరారు చేసిన అభ్యర్థి వెంకట్రామి రెడ్డి స్థానికుడు కాదనేది రఘునందన్ వాదన. అసలు స్థానికత పేరెత్తే అర్హత బీజేపీకి ఉందా అని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఉత్తరాది బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎందుకు నెత్తిన పెట్టుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఆ మాటకొస్తే బీఆర్ఎస్, తెలంగాణ లోకల్ అని తమ స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికుందని అంటున్నారు. బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మడంలేదని, ఓటమి భయంతోనే ఎన్నికల ముందు రాజకీయ కక్షసాధింపులకు బీజేపీ పాల్పడుతోందని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారంటున్నారు.

First Published:  24 March 2024 8:07 AM IST
Next Story