షర్మిలపై కమల వికాసం.. గత విమర్శలు మరిచాక మర్రి!?
షర్మిలకు బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలున్నాయని.. అందుకే మర్రి కూడా గత వైరాన్ని పక్కనపెట్టి షర్మిలను పరామర్శించేందుకు వెళ్లారన్న ప్రచారం నడుస్తోంది.
వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించే ప్రత్యర్థులు ప్రధానంగా ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు పాతబస్తీలో మతకల్లోలం సృష్టించిన వ్యక్తి వైఎస్ అని.. ఆ తర్వాత మర్రి శశిధర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో యాంటీ వైఎస్ గ్రూపే. మొన్నటి వరకు కూడా మర్రి శశిధర్ రెడ్డి వైఎస్ కుటుంబంపైనా తీవ్ర విమర్శలు చేసేవారు. జగన్‌పై అదేస్థాయిలో విరుచుకుపడేవారు. వైఎస్ ఫ్యామిలీ తెలంగాణను దోచుకుందని గతంలో విమర్శలు చేశారు.
అలాంటి మర్రి శశిధర్ రెడ్డి.. అపోలో ఆస్పత్రికి వెళ్లి వైఎస్ షర్మిలను పరామర్శించారు. పైగా ఇప్పుడాయన బీజేపీలో ఉన్నారు. షర్మిలను బీజేపీయే రంగంలోకి దింపిందని ఆరోపణలు బలంగా ఉన్న వేళ బీజేపీ నేతలు వరుసగా ఆమెకు సంఘీభావం తెలపడం, గతంలో వైఎస్ కుటుంబంతో వైరం ఉన్న మర్రి శశిధర్ రెడ్డి కూడా వెళ్లి షర్మిలను పరామర్శించడం హాట్ టాపిక్‌గా మారింది.
Met #YSRTP President @realyssharmila at Apollo Hospital, Jubilee Hills, where she is being treated for dehydration. Wished her speedy recovery. Her mother Smt YS Vijayamma can also be seen.@narendramodi @AmitShah @BJP4India @BJP4Telangana pic.twitter.com/a8Lh3wK6Ar
— M Shashidhar Reddy (@MSReddyOfficial) December 11, 2022
షర్మిలకు బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలున్నాయని.. అందుకే మర్రి కూడా గత వైరాన్ని పక్కనపెట్టి షర్మిలను పరామర్శించేందుకు వెళ్లారన్న ప్రచారం నడుస్తోంది. ఈ పరామర్శపై నెటిజన్లు స్పందిస్తున్నారు. మొన్నటి వరకు తెలంగాణను దోచుకున్న ఫ్యామిలీ అన్న వ్యక్తే ఇప్పుడు పరామర్శకు వెళ్లడం దేనికి సంకేతం అని ప్రశ్నిస్తున్నారు. షర్మిల ఓట్లు చీలిస్తే తమ పార్టీ బాగుంటుందని.. ఆమె బాగుండాలని ఈయన కోరుకుంటున్నారని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.