జితేందర్ రెడ్డి ట్వీట్.. మర్మమేంటి.?
గతంలో దున్నపోతులను వాహనంలోకి కొట్టి ఎక్కించే వీడియోను జితేందర్ రెడ్డి షేర్ చేయడంతో బీజేపీలో పెను దుమారమే చోటుచేసుకుంది.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. బట్టలు లేకుండా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్న ఓ చిన్న పిల్లోడి వీడియోను షేర్ చేశారు జితేందర్ డెడ్డి. ఈ వీడియోను ప్రధాని మోడీ, అమిత్ షా, సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్, జేపీ నడ్డా, శివప్రకాశ్‌కు ట్యాగ్ చేశారు. వాట్ టు డు, వాట్ నాట్ టు డు థింకింగ్ బిఫోర్ ఎలక్షన్స్ అంటూ పోస్టు పెట్టారు. ఐతే ఆయన ట్వీట్ వెనుక మర్మం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
What to do,what not to do.Thinking before elections.@narendramodi @AmitShah @sunilbansalbjp @tarunchughbjp @JPNadda @shivprakashbjp @BJP4India @BJP4Telangana pic.twitter.com/QYvt5xR7Ge
— AP Jithender Reddy (@apjithender) February 29, 2024
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ముందు బీజేపీ అధిష్టానం ఆలోచన తీరు అలా ఉందనే అర్థం చేసుకోవాలా? లేక మరేదైనా అర్థం వచ్చేలా ట్వీట్ పెట్టారా? అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇదే సీటును డి.కె.అరుణ కూడా ఆశిస్తున్నారు. డి.కె.అరుణకు దాదాపు టికెట్ ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది.
గతంలో దున్నపోతులను వాహనంలోకి కొట్టి ఎక్కించే వీడియోను జితేందర్ రెడ్డి షేర్ చేయడంతో బీజేపీలో పెను దుమారమే చోటుచేసుకుంది. పార్టీ నేతలకు అదేవిధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని అర్థం వచ్చేలా నాడు వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఈ ట్వీట్ కూడా హాట్ టాపిక్‌గా మారింది.