Telugu Global
Telangana

త్రిపుర గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి

ఇంద్రసేనా రెడ్డి సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1972లో MSC పూర్తి చేశారు.

త్రిపుర గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి
X

బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డిని కీలకపదవి వరించింది. ఆయనను త్రిపుర గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ ప్రకటన విడుదల చేసింది. ఇంద్రసేనారెడ్డితో పాటు జార్ఖండ్‌ మాజీ సీఎం రఘుబార్‌దాస్‌ను ఒడిశా గ‌వ‌ర్న‌ర్‌గా నియమించింది. ఇంద్రసేనా రెడ్డి సూర్యాపేట జిల్లాకు చెందిన వ్యక్తి. గతంలో ఆయన మలక్‌పేట నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్నారు.

ఇంద్రసేనా రెడ్డి సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1972లో MSC పూర్తి చేశారు. 1975లో కాకతీయ వర్సిటీ నుంచి ఎం.ఫిల్‌ పూర్తి చేశారు. రాజకీయాలపై ఆసక్తితో 1980లో బీజేపీలో చేరిన ఇంద్రసేనా రెడ్డి.. 1983, 85, 99లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మలక్‌పేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999-2003 మధ్యకాలంలో బీజేపీ శాసనసభ పక్షనేతగా వ్యవహరించారు. పార్టీ పరంగా కూడా కీలక పదవులు నిర్వహించారు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు.

ఇక ఇప్పటికే తెలంగాణకు చెందిన సి.హెచ్. విద్యాసాగర్‌ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేశారు. బండారు దత్తాత్రేయ ప్రస్తుతం హర్యానా గవర్నర్‌గా ఉన్నారు. ఇక ఏపీకి చెందిన మరో బీజేపీ నేత కంభంపాటి హరిబాబు మిజోరాం గవర్నర్‌గా ఉన్నారు.

First Published:  19 Oct 2023 1:59 AM GMT
Next Story