ఈటల అనుచరుల గూండాయిజం
హుజూరాబాద్‌కు చెందిన పలువురు దళితులు ఉప్పల్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టారు. ఈటల రాజేందర్ తమను ఇబ్బందులు పెట్టి, కేసుల పాలు చేసి భూములు లాక్కున్నారని ఆరోపణలు చేశారు.
ఉప్పల్ ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అనుచరులు బీభత్సం సృష్టించారు. ఈటలకు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెట్టిన దళితులపై దాడికి దిగారు. అక్కడితో ఆగకుండా మీడియా ప్రతినిధులపైనా దాడి చేశారు. మీడియా లోగోలు, ప్రెస్ క్లబ్‌లోని కుర్చీలు ధ్వంసం చేశారు. ఈటల అనుచరుల తీరుపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మ్యాటర్‌లోకి వెళ్తే.. హుజూరాబాద్‌కు చెందిన పలువురు దళితులు ఉప్పల్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టారు. ఈటల రాజేందర్ తమను ఇబ్బందులు పెట్టి, కేసుల పాలు చేసి భూములు లాక్కున్నారని ఆరోపణలు చేశారు. తమకు జరిగిన మోసాలపై ఓ కరపత్రం విడుదల చేశారు. తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటున్నారు. ఇంతలోనే 20మంది ఒక్కసారిగా ప్రెస్ క్లబ్‌లోకి దూసుకొచ్చారు. మా అన్నకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడతారా అంటూ రెచ్చిపోయారు. ప్రెస్‌మీట్ పెట్టిన వారిపై దాడికి దిగారు.
అక్కడున్న కుర్చీలు, మీడియా లోగోలతో వాళ్లను కొట్టారు. దీంతో బాధితులు అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. అయినా కూడా ఆగకుండా రోడ్డుపై తరుముకుంటూ బాధితులపై దాడి చేశారు. వీడియో షూట్ చేస్తున్న మీడియా ప్రతినిధులపైనా చేయి చేసుకున్నారు. వారి కెమెరాలు ధ్వంసం చేశారు.