ఫోన్ ట్యాపింగ్, బ్లాక్‌మెయిల్.. రేవంత్‌పై ఈటల సంచలన ఆరోపణలు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని ఆరోపించారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఖబర్ధార్ అంటూ హెచ్చరించారు.
బీజేపీ సీనియర్ నేత, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని ఆరోపించారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఖబర్ధార్ అంటూ హెచ్చరించారు.
నడమంత్రపు సిరిలాగా సీఎం పదవి వచ్చిన రేవంత్ రెడ్డి..నెల రోజుల వ్యవధిలోనే రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు ఈటల. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రక్షణ శాఖ భూములను మోదీ ప్రభుత్వం అప్పగించిన విషయం అప్పుడే మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. రేవంత్ ఒళ్లు, నోరు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు ఈటల.
వ్యాపారస్తులను బ్లాక్‌మెయిల్ చేసి రేవంత్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారని..ఈ చిట్టా కూడా రికార్డు అవుతోందన్నారు ఈటల రాజేందర్. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఈటల. రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపించడానికి ఇక్కడి వ్యాపారస్తులను బెదిరిస్తున్నారని, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు ఈటల. తెలంగాణకు నువ్వే అన్ని అనుకుంటే పొరపాటని..రేవంత్‌పైనా నిఘా పెట్టినవారు ఉన్నారంటూ హెచ్చరించారు ఈటల.