ఆ బీజేపీ నాయకుడు కనపడుటలేదు, పట్టిస్తే 15 లక్షలు... హైదరాబాద్ లో పోస్టర్లు
''ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు కనపడుట లేదు.. పట్టిచ్చిన వారికి రూ.15 లక్షల బహుమానం'' అని బీఎల్ సంతోష్ ఫోటోతో కూడిన పోస్టర్లు ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
బీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో అనుమానితుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతో ష్ పై హైదరాబాద్ లో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ పోస్టర్లు వెలిశాయి. ఇవి ఎవరు వేశారనేది తెలియరాలేదు.
''ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు కనపడుట లేదు.. పట్టిచ్చిన వారికి రూ.15 లక్షల బహుమానం'' అని బీఎల్ సంతోష్ ఫోటోతో కూడిన పోస్టర్లు ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ పోస్టర్లు బీఆరెస్ శ్రేణులే వేశాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కాగా, బీఏల్ సంతోష్ ఆదేశాల మేరకే బీఆరెస్ ఎమ్మెల్యేలను కొనడానికి రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ లు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసులో విచారణజరుపుతున్న సిట్ బీల్ సంతోష్ ను విచారణకు రావాలని నోటీసులిచ్చినప్పటికీ ఆయన హాజరుకాలేదు.
అయితే ఈ కేసును సీబీఐ కి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా కోర్టు బీజెపికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ సుప్రీం కోర్టుకు వెళ్ళింది. తాము చెప్పేంత వరకు సీబీఐ ఈ కేసును విచారించడానికి వీలులేదని సుప్రీం సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.