Telugu Global
Telangana

ఫోన్‌ పెట్టేయ్‌రా.. వెధవ! - కార్యకర్తపై బాబుమోహన్‌ బూతులు

కలిసి పనిచేయడానికి నువ్వెంత..? నీ బతుకెంత..? అంటూ బూతులందుకున్నారు. తానో ప్రపంచ స్థాయి నాయకుడినని.. తనను బీజేపీ కోసం అమిత్ షానే పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు.

ఫోన్‌ పెట్టేయ్‌రా.. వెధవ! - కార్యకర్తపై బాబుమోహన్‌ బూతులు
X

బీజేపీ నేత బాబుమోహన్ ఒక కార్యకర్తను బూతులు తిట్టారు. ఫోన్‌లో ఇష్టమొచ్చినట్టుగా దుర్భాష‌లాడారు. ఆ కార్య‌క‌ర్త‌నే కాదు.. ఆ పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజయ్‌ను కూడా బాబుమోహన్ వదిలిపెట్టలేదు. తానో ప్రపంచ స్థాయి నాయకుడినని చెప్పుకున్నారాయన. జోగిపేటకు చెందిన బీజేపీ కార్యకర్త వెంకటరమణ తొలుత బాబుమోహన్‌కు ఫోన్ చేశారు. ''చెప్పు తమ్ముడు'' అంటూ బాగానే రిసీవ్ చేసుకున్నారు బాబుమోహన్. కొద్ది సేపటి తర్వాత ''మీతో కలిసి పని చేయడం కోసం ఫోన్ చేశా''నని వెంకటరమణ చెప్పడంతో బాబుమోహన్‌కు కోపం వచ్చింది.

కలిసి పనిచేయడానికి నువ్వెంత..? నీ బతుకెంత..? అంటూ బూతులందుకున్నారు. తానో ప్రపంచ స్థాయి నాయకుడినని.. తనను బీజేపీ కోసం అమిత్ షానే పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. మధ్యలో బండి సంజయ్‌ ప్రస్తావన రాగా... ''బండి సంజయ్‌ ఎవడ్రా?.. వాడు నా తమ్ముడు''అంటూ మాట్లాడారు. తాను ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నానని, ఒక కార్యకర్తతో ఇలాగేనా మాట్లాడేది అని వెంకటరమణ చెప్పినా బాబుమోహన్ పట్టించుకోలేదు.

''జోగిపేటకు నువ్వేం చేయగలవు..? నీకు ఎన్ని ఓట్లు వస్తాయి?. నేను పుట్టినప్పుడు నీ వయసెంత?'' అంటూ ఊగిపోయారు. ఇంకోసారి ఫోన్ చేస్తే జోగిపేటలో చెప్పు తీసుకుని కొడుతా అంటూ దూషించారు. ఒక సందర్బంలో అవసరమైతే రేపు బీజేపీకి రాజీనామా చేస్తా అంటూ మాట్లాడారు. ''నా మాటలను రికార్డు చేస్తే చేసుకోరా.. ఫోన్‌ పెట్టేయ్‌రా.. గాడిద.. వెధవ'' అంటూ బూతులు తిట్టారు. సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్ అవుతోంది. ఫోన్ సంభాషణలో పదేపదే బూతులు వాడారు బాబుమోహన్.

First Published:  7 Feb 2023 12:07 PM IST
Next Story