Telugu Global
Telangana

బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది : ఎమ్మెల్యే వివేకానంద

బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని వివేకానంద మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలోని అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయిన చెప్పారు.

బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది : ఎమ్మెల్యే వివేకానంద
X

బీసీల కోసం బీజేపీ ఇంత వరకు చేసింది ఏమీ లేదని.. బీసీ సంక్షేమానికి బీఆర్ఎస్ ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యేలు వివేకానంద అన్నారు. బీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడంతో ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపిందని అన్నారు. తెలంగాణలో బీసీ డిక్లరేషన్ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టిందని విమర్శించారు.

బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని వివేకానంద మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలోని అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయిన చెప్పారు. బీజేపీ మత రాజకీయాలకు కాలం చెల్లిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలను నమ్మే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. బీసీలపై అంత ప్రేమ ఉంటే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నా.. బీసీ గణన మాత్రం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. దీనికి రాష్ట్రంలోని బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని వివేకానంద డిమాండ్ చేశారు. అభివృద్ధి విషయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా ఉందని అన్నారు. నేతన్నల సంక్షేమానికి తెలంగాణ అనేక పథకాలు తెచ్చిందని గుర్తు చేశారు.

గొల్ల కురుమల అభివృద్ధికి గొర్రెల పంపిణీ చేపట్టామని, నాయీబ్రాహ్మణులు, రజకులకు కరెంట్ సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. అన్ని కులాల వారికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నామని వివేకానంద వివరించారు. రాష్ట్రంలోని అన్ని కులాల ఆత్మగౌరవాన్ి పెంచేందుకు విలువైన భూములను ఇవ్వడంతో పాటు నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వమే ఇస్తోందని అన్నారు.

త్వరలోనే అన్ని కుల వృత్తుల వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయిచిన సంగతిని వివేకానంద గుర్తు చేశారు.

First Published:  19 May 2023 5:31 PM IST
Next Story