హైదరాబాద్ లో బీజేపీ కీలక మీటింగ్ నేడే..
నిన్న ప్రధాని నరేంద్రమోదీ వరంగల్ పర్యటన ముగిసింది, ఈరోజు జేపీ నడ్డా హైదరాబాద్ కి వస్తున్నారు. ఒకరోజు వ్యవధిలోనే ఇద్దరు కీలక నేతలు తెలంగాణకు రావడం విశేషం.
హైదరాబాద్ లో నేడు బీజేపీ కీలక మీటింగ్ జరగబోతోంది. 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు హైదరాబాద్ లో సమావేశం కాబోతున్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పటిష్టతకోసం చేపట్టాల్సిన కార్యాచరణకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారికి ఉపదేశం ఇవ్వబోతున్నారు. సాధారణంగా ఇలాంటి కీలక భేటీలన్నీ ఢిల్లీలో జరుగుతాయి. కానీ ఈ మీటింగ్ కి హైదరాబాద్ ని వ్యూహాత్మకంగా ఎంపిక చేసుకుంది బీజేపీ. తెలంగాణలో కమలదళం హడావిడికి ఇది మరో నిదర్శనం.
ఇటీవలే తెలుగు రాష్ట్రాలతో సహా పలు ఇతర రాష్ట్రాలకు అధ్యక్షులను, ఇన్ చార్జ్ లను మార్చేసింది బీజేపీ అధిష్టానం. కొత్తవారితోపాటు, మరికొన్ని రాష్ట్రాల నేతలతో హైదరాబాద్ లో ఈ రోజు మీటింగ్ పెట్టారు. రోజంతా ఈ సమావేశం జరుగుతుంది. 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఇతర కీలక నేతలు ఈ సమావేశానికి హాజరవుతారు.
నిన్న మోదీ, నేడు నడ్డా..
నిన్న ప్రధాని నరేంద్రమోదీ వరంగల్ పర్యటన ముగిసింది, ఈరోజు జేపీ నడ్డా హైదరాబాద్ కి వస్తున్నారు. ఒకరోజు వ్యవధిలోనే ఇద్దరు కీలక నేతలు తెలంగాణకు రావడం విశేషం. ఈ ఏడాది తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల వ్యూహం కోసమే హైదరాబాద్ లో మీటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.