తెలంగాణ పట్ల కేంద్రం వివక్షకు, బీజేపీ పాలిత రాష్ట్రాల పట్ల పక్షపాతానికి ఎయిమ్స్ ఒక గొప్ప ఉదహరణ
కేంద్రం 2014లో 16 ఎయిమ్స్ ఇన్‌స్టిట్యూట్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా, కేవలం ఏడు ఇన్‌స్టిట్యూట్‌లకు సంబంధించి మాత్రమే భవనాల నిర్మాణం పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఇనగంటి రవి కుమార్ అనే కార్యకర్త ఆర్‌టిఐ కింద అడిగిన ప్రశ్నకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం, తెలంగాణ, తమిళనాడులోని ఇన్‌స్టిట్యూట్లకు మాత్రమే అతి తక్కువ కేటాయింపులు జరిగాయి.
బీజేపీయేతర ప్రభుత్వాల పట్ల కేంద్ర బీజేపీ సర్కార్ చూపిస్తున్న వివక్షకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. బీజేపీ ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు అవసరమైనదానికన్నా ఎక్కువ నిధులు కేటాయిస్తున్న బీజేపీ సర్కార్ బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల విషయంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వహిస్తోంది.
కేంద్రం 2014లో 16 ఎయిమ్స్ ఇన్‌స్టిట్యూట్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా, కేవలం ఏడు ఇన్‌స్టిట్యూట్‌లకు సంబంధించి మాత్రమే భవనాల నిర్మాణం పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఇనగంటి రవి కుమార్ అనే కార్యకర్త ఆర్‌టిఐ కింద అడిగిన ప్రశ్నకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం, తెలంగాణ, తమిళనాడులోని ఇన్‌స్టిట్యూట్లకు మాత్రమే అతి తక్కువ కేటాయింపులు జరిగాయి. కేంద్రం బీబీనగర్‌లోని AIIMS నిర్మాణ కోసం రూ. 1365,95 కోట్లు మంజూరు చేసింది. కేంద్రం చెప్పిన దాని ప్రకారం బీబీనగర్‌లోని AIIMS అక్టోబర్ 2024లో పూర్తవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం రూ. 156 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇక రూ. 1977.8 కోట్లు రావాల్సిన తమిళనాడులోని మధుర ఇన్‌స్టిట్యూట్‌కు కేవలం రూ. 12.35 కోట్లు మాత్రమే వచ్చాయి.
ఆసక్తికరంగా, ఇతర రాష్ట్రాల్లోని ఎయిమ్స్ కేంద్రాలకు నిధులు విడుదల చేయడంలో కేంద్రం ఉదారంగా వ్యవహరించింది. గౌహతి (అస్సాం)లోని ఎయిమ్స్‌కు అంచనా వ్యయం రూ. 1123 కాగా, రూ. 717.52 కోట్లువిడుదలయ్యాయి. విజయపూర్, జమ్మూ ఎయిమ్స్ అంచనా వ్యయం రూ. 1661 కాగా, రూ. 1100.78 కోట్లు విడుదలయ్యాయి. అవంతిపొర, కాశ్మీర్ ఎయిమ్స్ అంచనా వ్యయం రూ. 1828 కోట్లు కాగా, రూ. 713.67 కోట్లు విడుదలయ్యాయి. డియోఘర్, జార్ఖండ్ ఎయిమ్స్ అంచనా వ్యయం రూ. 1103 కోట్లు కాగా, రూ. 793.86 కోట్లు విడుదలయ్యాయి. రాజ్‌కోట్, గుజరాత్ ఎయిమ్స్ అంచనా వ్యయం రూ. 1195 కోట్లు కాగా, రూ. 622.80 కోట్లు విడుదలయ్యాయి. ఇకAIIMS నిర్మాణానికి కావాల్సిన భూమి కేటాయించని బిహార్‌లోని దర్బంగా (అంచనా రూ. 1264 కోట్లు) , హర్యానాలోని మానేథి (రూ. 1299 కోట్లు)లకు నిధుల విడుదల జరగలేదు.
బీబీనగర్‌లోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ యూనిట్‌ను రూ. 1365.95 కోట్ల అంచనా వ్యయంతో డిసెంబర్ 17, 2018న కేంద్ర మంత్రివర్గం మంజూరు చేసింది. అక్టోబర్ 2024 నాటికి హెల్త్‌కేర్ సదుపాయాన్ని పూర్తి చేయాల్సి ఉంది. అయితే నిధుల కేటాయింపులను పరిశీలిస్తే, అక్కడ వచ్చే అక్టోబరు నాటికి కాదు కదా అసలు ఆ సంస్థ ఎప్పటికి పూర్తవుతుందనేది అర్దం కాని పరిస్థితి.
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, 2018లో నాలుగు ఇన్‌స్టిట్యూట్‌లు మంజూరు చేసింది కేంద్రం. వీటిలో బిలాస్‌పూర్ (హిమాచల్ ప్రదేశ్)లోని AIIMS దాదాపుగా పూర్తయింది, బిలాస్ పూర్ AIIMS కు రూ. 1471.04 కోట్ల అంచనా వ్యయం కాగా రూ. 1407.93 కోట్లు విడుదలయ్యాయి. డియోఘర్ (జార్ఖండ్)లోని ఇన్‌స్టిట్యూట్ కు మంజూరు చేసిన మొత్తం రూ. 1828 కోట్లలో రూ. 793.86 కోట్లు విడుదల చేయడంతో 86 శాతం నిర్మాణం పూర్తయ్యింది.