52 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల
తెలంగాణ ఎన్నికల్లో బీసీ, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సంబంధించి బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ మేరకు 52 మంది అభ్యర్థులకు ఆమోద ముద్ర వేసింది. కేంద్ర కమిటీ సభ్యులైన హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బి.ఎల్. సంతోష్‌తో పాటూ కమిటీ సభ్యులైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ శనివారం రాత్రి ప్రధాని మోడీతో విస్తృతంగా చర్చలు జరిపారు.
తెలంగాణ ఎన్నికల్లో బీసీ, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు తొలి జాబితాలోనే 12 మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది. మరోవైపు బీజేపీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్‌కు తొలి జాబితాలోనే గోషామహల్ నుంచి టికెట్ కేటాయించారు. ఆదివారం ఉదయమే ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తేశారు. ఆ వెంటనే ఆయనకు టికెట్ కేటాయించడం గమనార్హం.
ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల నుంచి, బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నుంచి, సోయం బాపూరావు బోథ్ నుంచి పోటీ చేయనున్నారు. ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నారు. అయితే హుజూరాబాద్ నుంచి ఏ అభ్యర్థినీ ప్రకటించలేదు.
ఇదే బీజేపీ తొలి లిస్టు..
Sl॰ | Legislative Assembly | Name of Candidate | |
Constituency No. & Name | |||
1 | 1 | Sirpur | Dr. Palvai Harish Babu |
2 | 3 | Bellampalli (SC) | Smt. Amarajula Sridevi |
3 | 6 | Khanapur (ST) | Shri Ramesh Rathod |
4 | 7 | Adilabad | Shri Payal Shankar |
5 | 8 | Boath (ST) | Shri Soyam Bapu Rao, MP |
6 | 9 | Nirmal | Shri Aleti Maheshwar Reddy |
7 | 10 | Mudhole | Shri Ramarao Patel |
8 | 11 | Armur | Shri Paidi Rakesh Reddy |
9 | 13 | Jukkal (SC) | Kum. T Aruna Tara |
10 | 16 | Kamareddy | Shri K Venkata Ramana Reddy |
11 | 17 | Nizamabad Urban | Shri Dhanpal Suryanaryana Gupta |
12 | 19 | Balkonda | Smt. Annapurnamma Aleti |
13 | 20 | Koratla | Shri Dharmapuri Arvind, MP |
14 | 21 | Jagtial | Smt. Dr Boga Sravani |
15 | 22 | Dharmapuri (SC) | Shri S Kumar |
16 | 23 | Ramagundam | Smt. Kandula Sandhya Rani |
17 | 26 | Karimnagar | Shri Bandi Sanjay Kumar, MP |
18 | 27 | Choppadandi (SC) | Smt. Bodiga Shobha |
19 | 29 | Sircilla | Smt. Rani Rudrama Reddy |
20 | 30 | Manakondur (SC) | Shri Arepalli Mohan |
21 | 31 | Huzurabad | Shri Eatala Rajender |
22 | 37 | Narsapur | Shri Erragolla Murali Yadav |
23 | 40 | Patancheru | Shri T Nandhishwar Goud |
24 | 41 | Dubbak | Shri Madavaneni Raghunandan Rao |
25 | 42 | Gajwel | Shri Eatala Rajender |
26 | 45 | Quthbullapur | Shri Kuna Srisailam Goud |
27 | 48 | Ibrahimpatnam | Shri Nomula Dayanand Goud |
28 | 50 | Maheshwaram | Shri Andela Sri Ramulu Yadav |
29 | 60 | Khairatabad | Shri Chinthala Ramachandra Reddy |
30 | 64 | Karwan | Shri Amar Singh |
31 | 65 | Goshamahal | Shri T Raja Singh |
32 | 66 | Charminar | Smt. Megha Rani |
33 | 67 | Chandrayangutta | Shri Satyanarayana Mudiraj |
34 | 68 | Yakutpura | Shri Veerender Yadav |
35 | 69 | Bahdurpura | Shri Y. Naresh Kumar |
36 | 83 | Kalwakurthy | Shri Thalloju Achary |
37 | 85 | Kollapur | Shri Aelleni Sudhakar Rao |
38 | 87 | Nagarjuna Sagar | Smt. Kankanala Niveditha Reddy |
39 | 91 | Suryapet | Shri Sankineni Venkateshwar Rao |
40 | 94 | Bhongir | Shri Gudur Narayana Reddy |
41 | 96 | Thungathurthy (SC) | Shri Kadiyam Ramchandraiah |
42 | 98 | Jangaon | Dr. Arutla Dashmanth Reddy |
43 | 99 | Ghanpur Station (SC) | Dr. Gunde Vijaya Ramarao |
44 | 100 | Palakurthi | Shri Lega Ramohan Reddy |
45 | 101 | Dornakal (ST) | Smt. Bhukya Sangeetha |
46 | 102 | Mahabubabad (ST) | Shri Jathoth Hussain Naik |
47 | 105 | Warangal West | Smt. Rao Padma |
48 | 106 | Warangal East | Shri Errabelli Pradeep Rao |
49 | 107 | Wardhannapet (SC) | Shri Kondeti Sridhar |
50 | 108 | Bhupalpalle | Smt. Chandupatla Keerthi Reddy |
51 | 111 | Yellandu (ST) | Shri Ravindra Naik |
52 | 119 | Bhadrachalam (ST) | Shri Kunja Dharma Rao |