Telugu Global
Telangana

కేటీఆర్‌ ను కాపాడేందుకే బీజేపీ మూసీ డ్రామా

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

కేటీఆర్‌ ను కాపాడేందుకే బీజేపీ మూసీ డ్రామా
X

లగచర్ల ఘటనలో కేటీఆర్‌ తప్పు బయట పడిందని.. కేటీఆర్‌ ను కాపాడడానికే బీజేపీ మూసీ డ్రామాకు తెరతీసిందని పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత అనేది బీఆర్‌ఎస్‌ సృష్టించిన కట్టు కథ అని.. అద్భుతంగా పాలన చేస్తున్న ప్రభుత్వంపై అసలు ప్రజా వ్యతిరేకత ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్కరోజు నిద్రతో బీజేపీ నేతలు ఏం తెలుసుకున్నారో చెప్పాలన్నారు. ఎవరు అడ్డుపడినా మూసీ పునరుజ్జీవం ఆగదని చెప్పారు. అక్కడ ఇల్లు కోల్పోయే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్నారు. మార్పు కోసమే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, ఆ మార్పును చూపించబోతున్నామని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటేనని.. ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారని అన్నారు. హైదరాబాద్‌ ను ప్రపంచ మహానగరాల సరసన చేర్చేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి దగ్గర విజన్‌ ఉందన్నారు. భవిష్యత్‌ తరాల కోసమే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు తలపెట్టామని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. తమది బుల్డోజర్‌ ప్రభుత్వం కాదు అని.. అది ఉత్తరప్రదేశ్‌ లో ఉందన్నారు.

First Published:  17 Nov 2024 5:56 PM IST
Next Story