మొన్న హరీష్, నిన్న ఏలేటి.. రేవంత్‌కు రాజీనామా సవాళ్లు
ఎంపీ బండి సంజయ్ సైతం రేవంత్‌ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ఇప్పటివరకూ 6 గ్యారంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే కరీంనగర్ లోక్‌సభ పోటీ నుంచి తప్పుకుంటానన్నారు బండి సంజయ్.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ల రాజకీయం నడుస్తోంది. పోలింగ్‌కు మరో 15 రోజులు మాత్రమే ఉండడంతో దూకుడు పెంచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఇప్పటికే రాజీనామాల రాజకీయం నడుస్తుండగా.. తాజాగా ఈ వార్‌లోకి బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది.
మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా సవాల్ మరువకముందే బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం రేవంత్‌కు ఛాలెంజ్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ ఇచ్చిన హామీలు అమలు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ సమర్పిస్తానన్నారు.
ఇక ఎంపీ బండి సంజయ్ సైతం రేవంత్‌ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ఇప్పటివరకూ 6 గ్యారంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే కరీంనగర్ లోక్‌సభ పోటీ నుంచి తప్పుకుంటానన్నారు బండి సంజయ్. అక్కడితో ఆగకుండా కాంగ్రెస్‌కు ప్రచారం కూడా చేస్తానన్నారు. డేట్ అండ్ టైమ్ నిర్ణయించాలన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేసినట్లు నిరూపించకపోతే కాంగ్రెస్ అభ్యర్థులంతా పోటీ నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు సంజయ్.