HCU ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాల ఘన విజయం... ఏబీవీపీ ఓటమి
శనివారం జరిగిన స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో SFI-ASA-DSU కూటమికి ABVPకి మధ్య హోరాహోరీగా పోరు నడిచింది. నిన్న అర్దరాత్రి ప్రకటించిన ఫలితాల్లో అన్ని స్థానాలను వామపక్ష కూటమి గెలుచుకుంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి కూటమి విజయం సాధించగా ఆరెస్సెస్ అనుబంద సంఘం ఏబీవీపీ ఓటమి పాలయ్యింది.
శనివారం జరిగిన స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో SFI-ASA-DSU కూటమికి ABVPకి మధ్య హోరాహోరీగా పోరు నడిచింది. నిన్న అర్దరాత్రి ప్రకటించిన ఫలితాల్లో అన్ని స్థానాలను వామపక్ష కూటమి గెలుచుకుంది.
1,838 ఓట్లతో SFI-ASA-DSU కూటమి అభ్యర్థి-ప్రజ్వల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదే కూటమికి చెందిన పృథ్వీ సాయి వైస్ ప్రెసిడెంట్ గా, కృపా మరియా జార్జ్ జనరల్ సెక్రటరీగా, కత్తి గణేష్ జాయింట్ సెక్రటరీగా, లిఖిత్ కుమార్ కల్చరల్ సెక్రటరీగా, సీహెచ్ జయరాజ్ స్పోర్ట్ సెక్రటరీగా గెలుపొందారు.
కాగా అంతకుముందు, యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎస్‌ఎఫ్ఐ, ఎబివిపికి చెందిన విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పక్షాలకు చెందిన కనీసం ఎనిమిది మంది విద్యార్థులు గాయపడ్డారు.
హాస్టల్‌లో SFI-ASA-DSU ప్యానెల్ ఎన్నికల పోస్టర్‌ను చింపివేస్తుండగా ABVP విద్యార్థిని SFI విద్యార్థి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడని SFI ఆరోపించింది. అక్కడ మొదలైన గొడవ ఘర్షణగా మారి విద్యార్థులు గాయాలపాలయ్యారు.