Telugu Global
Telangana

మైనంపల్లికి షాకివ్వబోతున్న బీఆర్ఎస్.. గులాబి గూటికి ఆ ఇద్దరు

బీఆర్‌ఎస్‌ లో తిరుపతిరెడ్డి చేరికకు సంబంధించి మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి నివాసంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ చర్చలు సఫలం అయితే తిరుపతి రెడ్డితోపాటు, నందికంటి శ్రీధర్ కూడా బీఆర్ఎస్ కి చేరువయ్యే అవకాశాలున్నాయి.

మైనంపల్లికి షాకివ్వబోతున్న బీఆర్ఎస్.. గులాబి గూటికి ఆ ఇద్దరు
X

మల్కాజ్ గిరి టికెట్ ఇచ్చినా కూడా సంతృప్తి చెందకుండా బీఆర్ఎస్ ని కాదని బయటకెళ్లిపోయారు సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. కాంగ్రెస్ లో చేరి ఆయన రెండు టికెట్లు సాధించుకున్నా.. ఆ పార్టీలో లుకలుకలకు కారణం అయ్యారు. ఇద్దరు సీనియర్లు కాంగ్రెస్ కి దూరమయ్యేలా చేశారు. సో.. ఆ ఇద్దరు అనుచరులు కాంగ్రెస్ కి దూరమైనట్టే లెక్క. అయితే ఇప్పుడు వారంతా బీఆర్ఎస్ కి దగ్గరవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే మల్కాజ్ గిరి, మెదక్ లో పాగా వేయాలనుకుంటున్న తండ్రీకొడుకులిద్దరికీ షాక్ తగిలినట్టే లెక్క.

బీఆర్ఎస్ లోకి తిరుపతిరెడ్డి, శ్రీధర్..

మల్కాజ్ గిరి కాంగ్రెస్ టికెట్ మైనంపల్లికి ఖాయం కావడంతో.. నిరాశపడిన మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ హస్తానికి బైబై చెప్పేశారు. ఇక మెదక్ సీటు విషయంలో కాంగ్రెస్ నిర్ణయంతో షాకైన డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి కూడా పార్టీకి దూరమయ్యారు. వీరిద్దరూ కాంగ్రెస్ ని వీడారు కానీ, ఇతర పార్టీల్లో చేరే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు వీరిద్దరితో బీఆర్ఎస్ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ లో తిరుపతిరెడ్డి చేరికకు సంబంధించి మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి నివాసంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ చర్చలు సఫలం అయితే తిరుపతి రెడ్డితోపాటు, నందికంటి శ్రీధర్ కూడా బీఆర్ఎస్ కి చేరువయ్యే అవకాశాలున్నాయి.

మైనంపల్లికి షాక్..

తన సొంత బలం ప్లస్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలంతో మైనంపల్లి ఆ రెండు నియోజకవర్గాల్లో గెలుపు ధీమాతో ఉన్నారు. కానీ కాంగ్రెస్ బలం ఇప్పుడు దూరమవుతోంది. వారిద్దరూ బీఆర్ఎస్ లో చేరితే అది ఆ పార్టీకి అదనపు బలం అవుతుంది. మల్కాజ్ గిరి, మెదక్ నియోజకవర్గాల విషయంలో రోజుల వ్యవధిలోనే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోయినా, తన కొడుకు ఓడిపోయినా.. ఇద్దరూ ఓడిపోయినా.. అది మైనంపల్లి స్వయంకృతాపరాధమే అనుకోవాలి.

First Published:  3 Oct 2023 8:16 AM GMT
Next Story