Telugu Global
Telangana

రాజాసింగ్‌కు షాక్‌.. బీజేఎల్పీ నేత‌గా ఏలేటి.!

మహేశ్వర్ రెడ్డిని తాత్కాలిక బీజేఎల్పీ లీడర్‌గా అంగీకరిస్తూ మిగిలిన ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు తమ సంతకాలతో కూడిన కాపీని స్పీకర్‌కు అందజేశారు.

రాజాసింగ్‌కు షాక్‌.. బీజేఎల్పీ నేత‌గా ఏలేటి.!
X

బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమించినట్లు తెలుస్తోంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. బీజేపీ తరపున BAC సమావేశానికి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. మహేశ్వర్ రెడ్డి నియామకంపై బీజేపీ హైకమాండ్ అధికారిక ప్రకటన చేయలేదు. దీనిపై త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

మహేశ్వర్ రెడ్డిని తాత్కాలిక బీజేఎల్పీ లీడర్‌గా అంగీకరిస్తూ మిగిలిన ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు తమ సంతకాలతో కూడిన కాపీని స్పీకర్‌కు అందజేశారు. అయితే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్ సంతకం చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం. బీజేపీ స్టేట్ చీఫ్‌ కిషన్ రెడ్డి ఫోన్ చేసి సర్ది చెప్పడంతో పాయల్ శంకర్ సంతకం చేశారని తెలుస్తోంది.

ప్రస్తుతం బీజేపీకి అసెంబ్లీలో 8 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఆరుగురు ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టిన వారే. రాజాసింగ్ ఒక్కరే హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాగా.. మహేశ్వర్ రెడ్డి 2009లో ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవిని రాజాసింగ్‌తో పాటు పాయల్ శంకర్ కూడా ఆశించారు. అయితే అన్ని సమీకరణాలు పరిశీలించిన తర్వాత బీజేఎల్పీ లీడర్‌గా మహేశ్వర్ రెడ్డిని నియమించేందుకు అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం.

First Published:  8 Feb 2024 3:45 PM IST
Next Story