గ్రేటర్‌లో BRSకు షాక్.. డిప్యూటీ మేయర్ జంప్.!
మోతె శ్రీలత రెడ్డి 2020లో జరిగిన GHMC ఎన్నికల్లో తార్నాక డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచారు. 2021 ఫిబ్రవరి 11న గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. GHMC డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కొద్ది రోజులుగా వీరు పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ తాజాగా రేవంత్ రెడ్డిని కలిశారు శ్రీలత రెడ్డి దంపతులు.
శనివారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ అధ్యక్షతన జరిగిన కార్పొరేటర్ల సమావేశానికి శ్రీలత రెడ్డి డుమ్మా కొట్టారు. తెలంగాణ ఉద్యమకారుడైన శ్రీలత భర్త శోభన్ రెడ్డి మల్కాజ్‌గిరి లేదా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల నుంచి టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మోతె శ్రీలత రెడ్డి 2020లో జరిగిన GHMC ఎన్నికల్లో తార్నాక డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచారు. 2021 ఫిబ్రవరి 11న గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఇప్పటికే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రేవంత్‌ను కలిసి కేటీఆర్‌కు షాకిచ్చారు. మరోవైపు మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.