బీఆర్ఎస్‌కు బిగ్‌షాక్.. కాంగ్రెస్‌లోకి GHMC మేయర్..?
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆపరేషన్ హైదరాబాద్ చేపట్టింది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి బీఆర్ఎస్ నేత కేశవరావు ఇంటికి వెళ్లారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. గద్వాల విజయలక్ష్మితో పాటు 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆపరేషన్ హైదరాబాద్ చేపట్టింది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి బీఆర్ఎస్ నేత కేశవరావు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మిని ఆమె కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇందుకు విజయలక్ష్మి సైతం అంగీకరించినట్లు సమాచారం.
2016లో తొలిసారిగా టీఆర్ఎస్ తరపున బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచారు విజయలక్ష్మి. 2021లో రెండో సారి గెలిచి మేయర్‌గా ఛాన్స్ కొట్టేశారు. ఇప్పటికే డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.