కేసీఆర్ కి సెల్యూట్ చేసిన భీమ్ ఆర్మీ..
అంబేద్కర్ పేరుతో సచివాలయం నిర్మించడమే కాకుండా.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం కూడా అభినందనీయమన్నారు చంద్రశేఖర్ ఆజాద్. సీఎం కేసీఆర్ దార్శనికత మహోన్నతమైనదని చెప్పారు.
దళితుల అభ్యున్నతికోసం తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజస్థాన్ లోని జైపూర్ లో ఆగష్టు 26న జరిగే భీమ్ ఆర్మీ మహాసభలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా సీఎం కేసీఆర్ ను చంద్రశేఖర్ ఆజాద్ ఆహ్వానించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను ఆయన కొనియాడారు.
దళితుల అభ్యున్నతి, వారి సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలవుతున్న 'దళితబంధు' సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ఎస్సీ కులాలను సామాజిక, ఆర్థిక వివక్ష నుండి ఆత్మ గౌరవం దిశగా సీఎం శ్రీ కేసీఆర్ అమలు చేస్తున్న దళిత ప్రగతి కార్యాచరణ దళిత జాతి విముక్తికి బాటలు వేసేలా ఉందని, ఇది యావత్… pic.twitter.com/H6RfIuhXG9
— Telangana CMO (@TelanganaCMO) July 28, 2023
దళితబంధు పథకం అమలు, దానివల్ల కలుగుతున్న ప్రయోజనాలు, వ్యక్తిగత విజయగాథలను తాను స్వయంగా తెలుసుకున్నానని చెప్పారు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్. అట్టడుగు స్థాయిలో పనిచేసే దళితుల సాధికారతకు తోడ్పడుతూ, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్న దళితబంధు పథకం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కొనసాగుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళిత ప్రగతి కార్యాచరణ, దళిత జాతి విముక్తికి బాటలు వేసేలా ఉందని, ఇది దళితజాతి మొత్తం గర్వించదగ్గ సందర్భమని అన్నారాయన. దేశంలో దళితుల పరిస్థితి, దళితుల పట్ల పాలకులు అనుసరిస్తున్న వైఖరి, కులం పేరుతో మనుషులను విభజిస్తూ, సామాజిక వివక్షకు గురిచేస్తూ, ఆహార నియమాలను నియంత్రిస్తూ, దళితులపై దేశంలో అమలవుతున్న దమనకాండపై ఆయన సీఎం కేసీఆర్ తో చర్చించారు.
అంబేద్కర్ పేరుతో సచివాలయం నిర్మించడమే కాకుండా.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం కూడా అభినందనీయమన్నారు చంద్రశేఖర్ ఆజాద్. సీఎం కేసీఆర్ దార్శనికత మహోన్నతమైనదని చెప్పారు. తెలంగాణలో గురుకుల విద్య అద్భుతంగా అమలవుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న వందలాది గురుకులాలు ప్రపంచ జ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా దళిత బిడ్డలు విదేశాల్లో చదువుకుంటున్నారని, సీఎం కేసీఆర్ దళితజనబాంధవుడని కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. తదితరులు జైభీమ్ ఆర్మీ చీఫ్ ని కలిశారు.