Telugu Global
Telangana

భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రసంగమంతా అబద్ధాలే

రాష్ట్రం దివాలా తీసిందా లేక నీ మైండ్ దివాలా తీసిందా రేవంత్ రెడ్డి అని హరీశ్‌ ఫైర్‌

భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రసంగమంతా అబద్ధాలే
X

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రసంగమంతా అబద్ధాలేనని.. అది మొత్తం రాజకీయ స్పీచ్‌లా ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌ అయ్యారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భట్టి బడ్జెట్‌ బడా జూట్‌. ఆయన ప్రసంగంలో అతిశయోక్తులు తప్ప ఏమీ లేదు. అరచేతిలో వైకుంఠం చూపించారు. అందాల పోటీకి 250 కోట్లు బడ్జెట్‌లో పెట్టారు. మహాలక్ష్మి కింద రూ. 2500 రూపాయలకు మాత్రం పెట్టలేదు. లక్షా యాభై వేల పెన్షన్‌లు ఎత్తేశారని ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో రుణమాఫీ ఊసే లేదు రుణమాఫీ మిగతా వాళ్లకు ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. భట్టి విక్రమార్క మీ నియోజకవర్గానికి వెళ్దామా? రుణమాఫీ ఎలా అయిందో లేదో తెలుసుకుందామా? రేవంత్‌ రెడ్డి ఆలోచనలు దివాలా తీశాయి. ఈ సంవత్సరం మద్యం ద్వారా 50 వేల కోట్లు రావాలని రేవంత్ రెడ్డి ఆశిస్తున్నాడు.ఇప్పటికే బీర్ల ధరలు పెంచిండు.. లిక్కర్ ధరలు పెంచుతున్నాడు. కొత్త బ్రాండ్లు తెస్తున్నాడు.రాష్ట్రం దివాలా తీసిందా లేక నీ మైండ్ దివాలా తీసిందా రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారు . టోల్ గేట్ల ద్వారా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గత సంవత్సరం రూ.5,888 కోట్ల రెవెన్యూ మిగిలి ఉంది, ఈ సంవత్సరం రూ.2,738 కోట్లు రెవెన్యూ మిగిలి ఉంటుంది అని బడ్జెట్ బుక్ లో రాశారు .కానీ రేవంత్ రెడ్డిని ఉద్యోగులు జీతాలు అడిగితే రూ.500 కోట్లు కూడా లేవు అని అబద్ధాలు చెప్తున్నాడని విమర్శించారు.

First Published:  19 March 2025 4:30 PM IST
Next Story