తెలంగాణలో భానుడి భగభగలు.. హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత
తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా భానుడు భగ్గుమంటున్నాడు. మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి.హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణం కంటే 3.3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. కాగా.. వచ్చే పది రోజుల్లో తెలంగాణలో కాస్త భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడబోతున్నట్టు తెలంగాణ వాతావరణ నిపుణలు చెప్తున్నారు.ఈ నేఫథ్యంలోనే.. తెలంగాణ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చాడు. మార్చి 19 వరకు వేడిగాలులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అయితే.. మార్చి 20 నుంచి 24 తేదీల్లో మాత్రం రాష్ట్రంలో అకాల వర్షాలు కురిస్తాయని హెచ్చరించాడు. అవి కూడా బలమైన ఉరుములతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశాడు.