భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న గవర్నర్
ప్రధానాలయంలోని ధృవమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన జిష్ణుదేవ్ వర్మ
BY Raju Asari25 Oct 2024 10:31 AM IST
X
Raju Asari Updated On: 25 Oct 2024 10:31 AM IST
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధానాలయంలోని ధృవమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆంజనేయస్వామి, లక్ష్మీతాయారు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. గవర్నర్‌కు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను ఆలయ ఈవో రమాదేవి అందజేశారు. అంతకుముందు గవర్నర్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ స్వాగతం పలికారు. గవర్నర్‌తో పాటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్వామివారిని దర్శించుకున్నారు.
Next Story