సాత్విక్ చనిపోయేకన్నా కొద్ది ముందు అతన్ని చితకబాదారు, బూతులు తిట్టారు
సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడిన రోజు అతని తండ్రి కాలేజ్ కు వచ్చి సాత్విక్ ను కలిసి వెళ్ళాడు. తండ్రి వెళ్ళిపోయిన కొద్దిసేపటికే స్టడీ అవర్ లో కృష్ణారెడ్డి, ఆచార్యలు సాత్విక్ ను బూతులు తిడుతూ అందరి ముందు దారుణంగా కొట్టారు. సాత్విక్ కుటుంబ సభ్యులను కూడా తిట్టారు.
నార్సింగి చైతన్య కాలేజ్ లో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటనలో అనేక విషయాలు బైటపడుతున్నాయి. సాత్విక్ ను కాలేజ్ ప్రిన్సిపాల్, ఫ్యాకల్టీ దారుణంగా వేధించారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు.
సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడిన రోజు అతని తండ్రి కాలేజ్ కు వచ్చి సాత్విక్ ను కలిసి వెళ్ళాడు. తండ్రి వెళ్ళిపోయిన కొద్దిసేపటికే స్టడీ అవర్ లో కృష్ణారెడ్డి, ఆచార్యలు సాత్విక్ ను బూతులు తిడుతూ అందరి ముందు దారుణంగా కొట్టారు. సాత్విక్ కుటుంబ సభ్యులను కూడా తిట్టారు.
అప్పటికే ప్రతిరోజూ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్, ఆచార్య, క్యాంపస్ ఇంచార్జి నరేష్, శోభన్ ల వేధింపులకు బలవుతున్న సాత్విక్ ఇక భరించలేకపోయాడని తెలుస్తోంది. వారి వేధింపులు భరించే సహనం నశించిన సాత్విక్ ఏం చేయాలో అర్దం కాక ఇక చనిపోవాలని నిర్ణయించుకొని క్లాస్ రూం లోనే ఉరి వేసుకొని చనిపోయాడు.
సాత్విక్ ఆత్మహత్యచేసుకునే ముందు సూసైడ్ లెటర్ రాశాడు. తనను ఆ నలుగురు దుర్మార్గంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తననే కాకుండా విద్యార్థులందరినీ వేధిస్తున్న ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్, ఆచార్య, క్యాంపస్ ఇంచార్జి నరేష్, శోభన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని వదలొద్దంటూ తన పేరెంట్స్ కు రాసిన లేఖలో సాత్విక్ కోరాడు.