Telugu Global
Cinema & Entertainment

మంచు మనోజ్ దంపతులపై కేసు నమోదు ఎందుకంటే?

టాలీవుడ్ హీరో మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనికపై చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

మంచు మనోజ్ దంపతులపై కేసు నమోదు ఎందుకంటే?
X

టాలీవుడ్ హీరో మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనికపై చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా మోహన్ బాబు యూనివర్శిటీలోకి వెళ్లేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్న మంచు మనోజ్.. భార్య మౌనికా రెడ్డితో కలిసి వచ్చారు. పోలీసులు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా యూనివర్శిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో యూనివర్సిటీ సిబ్బందికీ, మనోజ్ బౌన్సర్లకూ మధ్య ఘర్షణ చోటు జరిగింది. చివరకు పోలీసులకు తన తాత సమాధి వరకూ వెళ్లి వస్తానని చెప్పి అనుమతి తీసుకుని మనోజ్ లోపలికి వెళ్లారు.

దీంతో వివాదం ముగిసిందని భావిస్తున్న తరుణంలో పోలీసులు, మోహన్ బాబు వర్శిటీ సిబ్బందిపై మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కొనసాగింపుగా మోహన్ బాబు యూనివర్శిటీ సిబ్బందిపై చంద్రగిరి పోలీసు స్టేషన్ కు వెళ్లి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మంచు మనోజ్ దంపతులపై మోహన్ బాబు పీఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. మరోవైపు తమపై దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేయడంతో మోహన్‌బాబు పీఏతో పాటు మరో 8 మంది సిబ్బందిపై కేసు నమోదైంది.

First Published:  17 Jan 2025 3:39 PM IST
Next Story