అభిమానులకు సారీ చెప్పిన బన్నీ ఎందుకంటే?
ఆ విషయంలో నన్ను క్షమించండని పుష్ప-2 ట్రైలర్ ఈవెంట్‌కు హాజరైన అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి బన్నీ చెప్పారు
బిహార్ పాట్నాలో పుష్ప-2 ట్రైలర్ లాంచ్ గ్రాండ్‌గా జరిగింది. ఈవెంట్‌కు హాజరైన అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వేదికపై మాట్లాడారు. బిహార్ ప్రజలందరికీ నమస్కారం బీహార్‌కు మొదటిసారి వచ్చా. మీ ప్రేమ, అభిమానానికి నా ధన్యవాదాలు. పుష్ప ఎప్పుడు తలవంచలేదు.. కానీ మొదటిసారి మీ ప్రేమకు తలవంచుతున్నా. మీరంతా ఎలా ఉన్నారు? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్. నా హిందీ కొంచెం బాగుండదు. ఈ విషయంలో నన్ను క్షమించండి. పుష్పపై మీరు చూపిస్తున్న ప్రేమకు ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా. మీ ప్రేమే ఈ సినిమా ఇంత గొప్పగా తీయడానికి, ఇంత గొప్పగా అందరికీ నచ్చడానికి కారణం. పుష్ప టీమ్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు అన్నారు. నా హిందీ మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు నన్ను క్షమించగలరు అని అన్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కాబోతుంది. అందరికీ నచ్చుతుంది. థ్యాంక్యూ బీహార్. థ్యాంక్యూ పాట్నా' అంటూ ఐకాన్ స్టార్ మాట్లాడారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా... ఫ్లవర్ కాదు..’ అంటూ డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు ఐకాన్ స్టార్.
హీరోయిన్ రష్మిక మందన్నా మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. ఇంతటి ప్రేమను అందించిన పాట్నా ప్రజలందరికీ నా ధన్యవాదాలు. పుష్ప శ్రీవల్లి ఈ కార్యక్రమానికి మీ అందరిని ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నా. ఈ మూవీ కోసం రెండు సంవత్సరాల మీ ఎదురుచూపులు కచ్చితంగా మీరు ఊహించిన దానికి మించి ఉంటుందిన. ఇంతమంది ఫ్యాన్స్ పుష్ప ప్రపంచంలోకి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చూడాలని నేను కోరుకుంటున్నా' అని అన్నారు శ్రీవల్లి. ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్ షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ విడుదలయిన మాస్ ట్రైలర్ ఏకంగా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టనుంది.