కార్తీక సోమవారం శోభ.. భక్తులతో పోటెత్తిన శైవక్షేత్రాలు
నేడు మూడవ కార్తీక సోమవారం సందర్బంగా తెలు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు భక్తుల దీపారాధనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
నేడు మూడవ కార్తీక సోమవారం సందర్బంగా తెలు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు భక్తుల దీపారాధనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజామునుంచి భక్తులు గోదావరి నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి.. కార్తీక దీపాలను వదిలారు. శ్రీశైలం , విజయవాడ, రాజమండ్రి, వేములవాడ భద్రాచలం, యాదగిరిగుట్ట వంటి ప్రధాన ఆలయాల్లో భక్తులు వేకువజాము నుంచే దర్శనాలకు పోటెత్తారు. పరమశివుడిని దర్శించుకుని తరించారు.
ముఖ్యంగా విజయవాడలోని కృష్ణాతీరానికి, రాజమండ్రిలో గోదావరి తీరానికి భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేశారు. కార్తీక పూర్ణిమ ప్రతి సంవత్సరం ఉపవాస దీక్షతో ఆచార సంప్రదాయంగా వస్తున్న కర్పూర అఖండ జ్యోతిని వెలిగించారు గుడవర్తి వంశస్తులు. కర్పూర అఖండ జ్యోతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి పూజలు నిర్వహించి.. మొక్కులు చెల్లించుకున్నారు.