Telugu Global
Telangana

బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రంతో పోరాడుతా

బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది తీర్మానం కాదని బిల్లు అన్న సీఎం

బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రంతో పోరాడుతా
X

బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అంశాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై కులగణన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది తీర్మానం కాదని బిల్లు అని స్పష్టం చేశారు. చట్టపరంగా సాధించుకోవడానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈసారి 4 ఎమ్మెల్సీ స్థానాలను ఎస్టీ, ఎస్టీ, బీసీలకే ఇచ్చామని ఆయన అసెంబ్లీలో గుర్తు చేశారు.

1979లో మండల్‌ కమిషన్‌ వేశారని, మండల్‌ కమిషన్‌తోనే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత ప్రారంభమైందని సీఎం అన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించామని గుర్తు చేశారు. కులగణన, బీసీ రిజ్వేషన్ల అంశాన్ని ఏడాదిలోపు ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై అంశంపై మద్దతు ఇస్తున్న అందరికీ సీఎం ధ్యవాదాలు తెలిపారు.

కేంద్రం నుంచి అంగీకారం కోసం పోరాడుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి ప్ఉరధాని మోడీ కలవడానికి అన్ని పార్టీల నేతలు ముందుకు రావాలనని పిలుపునిచ్చారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ జరగాలని వెల్లడించారు. అవసరమైన రాజ్యాంగ సవరణ జరిగేలా అందరం కలిసి పోరాడుదామని, పార్లమెంటులో చట్టం కోసం మోడీ, రాహుల్‌ గాంధీని కలుద్దామని అన్నారు.తెలంగాణలో బీసీల లెక్క తేలిందని రాష్ట్రంలో 56.36 శాతం మంది బీసీలున్నారని సీఎం చెప్పారు. వారికి 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లుగా తెచ్చమన్నారు. ఈ తీర్మానం సందర్భంగా చర్చలో పాల్గొని సలహాలు ఇచ్చిన గంగుల కమలాకర్‌, హరీశ్‌రావు, పాయల్‌ శంకర్‌, కూనంనేని సాంబశివరావులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

అంతకుముందు ఈ బిల్లుపై మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. ఈ బిల్లును ఆహ్వానిస్తూ సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు. పార్లమెంటు ఆమోదం పొందితేనే సంపూర్ణ సంతోషం అన్నారు. చాలా రాష్ట్రాలు 50 శాతానికి పైగా రిజర్వేషన్లు ప్రతిపాదించి విఫలమయ్యాయి. ఒక్క తమిళనాడులోనే 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నాయని , ఆ ఉదంతాన్ని పరిశీలించి కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు.

బీసీ బిల్లును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పూర్తి మద్దతు తెలుపుతున్నామపి మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు.ఎప్పుడు నిజంగా బీసీ వర్గాలు సంతోషపడతాయంటే.. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ వచ్చినప్పుడు, స్థానిక సంస్థల్లో, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 42 శాతం రిజర్వేషన్ ఫలితాలు వారికి అందినప్పుడు ఆ వర్గాలు చాలా సంతోషపడతాయన్నారు.వారికి ఆ ఫలితాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.రాష్ట్ర శాసనసభలో మనం బిల్లు ఏర్పాటు చేయడంతో పాటు పార్లమెంటులో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందని తెలుపుతున్నాను అన్నారు.ఈ బిల్లు పాస్ కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ 100 మంది ఎంపీలు ఉన్నారు.ఈ బిల్లు కోసం ఆయన గట్టిగా పూనుకోవాలని కోరుతున్నామన్నారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్లో, డైరెక్టర్లులో బీసీలకు 50శాతం రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీనే అన్నారున.మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడాలేని విధంగా గౌడన్నల కోసం మద్యం షాపుల్లో రిజర్వేషన్ తెచ్చింది.రేపు బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మూడు అంశాలను బేషజాలకు పోకుండా చేర్చాలని కోరుతున్నాం.బీసీలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నిజమైన ప్రేమ ఉంటే ఈ మూడు అంశాలను చేర్చాలని బీఆర్ఎస్ పక్షాన అమెండ్మెంట్ ఇచ్చాం.ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి.బిల్లులో ఈ అంశం చేర్చడానికి ఢిల్లీ పర్మిషన్ అవసరం లేదు.. రేపటి నుండే రాష్ట్రంలో బీసీలకు 42శాతం కాంట్రాక్టు పనుల్లో అవకాశం లభిస్తుంది.బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.. క్యారీ ఫార్వర్డ్ విధానంలో అమలు చేయాలి. క్యారీ ఫార్వర్డ్ విధానంలో కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేశారు.బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీకి సైతం వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.ఆమోదం విషయం పార్లమెంట్ చేతిలో ఉంది కాబట్టి భేషజాలకు పోకుండా ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీ సబ్ ప్లాన్ ను చేర్చండి.బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు నిధులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

First Published:  17 March 2025 4:15 PM IST
Next Story