సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీసీ నేతలు
డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుపై కృతజ్ఞతలు
BY Naveen Kamera4 Nov 2024 7:09 PM IST

X
Naveen Kamera Updated On: 4 Nov 2024 7:09 PM IST
సీఎం రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య సహా పలువురు బీసీ నేతలు కలిశారు. సోమవారం జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎంతో వారు భేటీ అయ్యారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు చట్ట పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. డెడికేటెడ్ కమిషన్ తోనే బీసీలకు న్యాయం జరుగుతుందని, ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమన్నారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యే దానం నాగేందర్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు ఉన్నారు.
Next Story