Telugu Global
Telangana

ఈ నెల 26న పార్లమెంట్‌ ముట్టడికి బీసీ సంఘం పిలుపు

ఈ నెల 26న బీసీలతో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య తెలిపారు

ఈ నెల 26న పార్లమెంట్‌ ముట్టడికి  బీసీ సంఘం పిలుపు
X

ఈ నెల 26న బీసీలతో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు,మాజీ ఎంపీ ఆర్‌ కృష్ణయ్య తెలిపారు. జాతీయ బీసీ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ నేతృత్వంలో 13 బీసీ సంఘాలు, 30 కుల సంఘాల నాయకులతో ఇవాళ కాచిగూడ అభినందన్‌ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి, జనగణనలో కులగణన చేయాలని డిమాండ్‌ చేశారు. ఉవ్వేత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమం లాగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.

జనాభా దామాషా ప్రకారం కేంద్రం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని అందుకు పార్లమెంట్‌లో రాజ్యంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ, చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వికసిత్‌ భారత్‌ అంటే అంబాని, ఆధాని కాదని, దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలైన బహుజనులను బాగుచేయడమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నంద గోపాల్‌, ఉదయ్‌, నీల వెంకటేశ్‌, రాఘవ, రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.

First Published:  23 Oct 2024 9:20 PM IST
Next Story