Telugu Global
Telangana

ఢిల్లీ గడ్డ మీద బతుకమ్మ జోరు... దటీజ్ కేసీఆర్!!

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాతే తెలంగాణ పండుగలు, పద్ధతులు, భాషకు గౌరవం దక్కిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బతుకమ్మ, బోనాల వంటి పండుగలను కేసీఆర్‌ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి గౌరవాన్ని పెంచిందని తెలిపారు.

ఢిల్లీ గడ్డ మీద బతుకమ్మ జోరు... దటీజ్ కేసీఆర్!!
X

ఢిల్లీలో తెలంగాణ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కిందంటే, మొదటిసారిగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ (Delhi)లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారంటే అది కేసీఆర్ గొప్పతనమే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాతే తెలంగాణ పండుగలు, పద్ధతులు, భాషకు గౌరవం దక్కిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బతుకమ్మ, బోనాల వంటి పండుగలను కేసీఆర్‌ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి గౌరవాన్ని పెంచిందని తెలిపారు. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ కేంద్రం వైపు చూస్తున్నారనగానే ఢిల్లీలోని ఇండియాగేట్‌ వద్ద బతుకమ్మ వెలుగుతోందని పేర్కొన్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పతాకం ఎగిరే రోజులు ఎంతో దూరంలో లేవని ఆమె అన్నారు.

''తెలంగాణ వచ్చాక ఎనిమిదేళ్లకు బీజేపీ‌కి బుద్ధి వచ్చింది. గెట్ వే ఆఫ్ ఇండియా దగ్గర బతుకమ్మ ఆడుతున్నారు. ఇదంతా కేసీఆర్ గొప్పతనం. తెలంగాణ‌లో సర్దార్ వల్లబాయి పటేల్ పేరుతో విమోచనం అంటారు. గుజరాత్‌లో అదే పటేల్ విగ్రహం పెట్టి స్టాచ్యూ ఆఫ్ ఇక్వాలిటీ అంటున్నారు. విభజన కావాలో..యూనీటి కావాలో? తేల్చుకోవాలి'' అని కవిత పేర్కొన్నారు.

First Published:  27 Sept 2022 11:24 PM IST
Next Story