సెక్రటేరియట్ లో బతుకమ్మ వేడుకలు
ఉత్సాహంగా ఆడిన మహిళా ఉద్యోగులు
BY Naveen Kamera5 Oct 2024 7:08 PM IST

X
Naveen Kamera Updated On: 5 Oct 2024 7:08 PM IST
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ లో బుధవారం సాయంత్రం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ ఉత్సవాలు నిర్వహించారు. మహిళా అధికారులు, ఉద్యోగులు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను సెక్రటేరియట్ లాన్స్ లో ఉంచి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. మంత్రి సీతక్క, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Next Story