Telugu Global
Telangana

అంతర్జాతీయస్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్

ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా బాపూ ఘాట్ అభివృద్ధి చేయబోతున్నామన్న సీఎం రేవంత్‌

అంతర్జాతీయస్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్
X

ఏబీపీ నెట్ వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదరన్‌ రైజింగ్‌ సమ్మిట్‌ 2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయస్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్ ను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా బాపూ ఘాట్ అభివృద్ధి చేయబోతున్నామని చెప్పారు. ఈసీ, మూసీ నదులు కలిసే చోట బాపూ ఘాట్ ఉందన్నారు.పటేల్ విగ్రహంలా... బాపూ ఘాట్ లో గాంధీజీ విగ్రాహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మూసీ పునరుజ్జీవాన్ని ,బాపూ ఘాట్ అభివృద్ధిని బీజేపీ వ్యతిరేకిస్తోందని సీఎం ధ్వజమెత్తారు. దీన్ని బీఆరెస్, బీజేపీ ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నాయి? అని ప్రశ్నించారు. గాంధీ వారసులుగా మేం బాపూ ఘాట్ ను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ హయాంలో దేశంలో అభివృద్ధి కోసం భాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్‌ వరకు ఎన్నో ప్రాజెక్టులు కట్టారు. కొత్త వర్సిటీలు ఏర్పాటు చేసి విద్యావ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని సీఎం గుర్తు చేశారు. ఇందిరా గాంధీ హయాంలో గరీబీ హఠావోతో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికీ ఆహారం అందాలని చర్యలు చేపట్టారు. రాజీవ్‌గాంధీ హయాంలో ఓటింగ్‌ వయసు 21 నుంచి 18 ఏళ్లకు మార్చారు. కంప్యూటర్లతో ఐటీ విప్లవం తీసుకురావడంతోపాటు టెలికాం రంగంలో మార్పులు తీసుకొచ్చాని సీఎం పేర్కొన్నారు.

గాంధీ ఆలోచనలకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో అధికారం కల్పించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే అన్నారు. పీవీ నరసింహారావు దక్షిణాది నుంచి ప్రధానిగా సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సరళీకరణ ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ తో కష్టాల్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన ఠీవీ మన పీవీ అన్నారు. నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు కాంగ్రెస్‌ నేతలంతా ప్రజల మౌలికావసరాలు తీర్చాలని యత్నించారు. తర్వాత 30 ఏళ్లు టెక్నాలజీ, టెలికాం ఇతర రంగాల్లో కాంగ్రెస్‌, యూపీఏ సేవలు అందించింది. కాంగ్రెస్‌, యూపీఏ హయాంలోనే ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని సీఎం రేవంత్‌ తెలిపారు

First Published:  25 Oct 2024 9:17 AM GMT
Next Story