Telugu Global
Telangana

అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్‌ పోటీ.. ఏ పార్టీ, ఎక్కడి నుంచి..?

2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీకి ప్రచారం చేశారు బండ్ల గణేష్‌. ఆ ఎన్నికల్లో బండ్ల గణేష్‌ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్‌ పోటీ.. ఏ పార్టీ, ఎక్కడి నుంచి..?
X

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారా..? ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడనున్నారా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కాంగ్రెస్‌ పార్టీతో ఇప్పటికే చర్చలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కూకట్‌పల్లి నుంచి బండ్ల గణేష్‌ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని స‌మాచారం.

కాంగ్రెస్ అధిష్టానం సైతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక టికెట్‌ను బలమైన సామాజిక వర్గానికి టికెట్‌ ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి నుంచి బండ్ల గణేష్‌ పేరును పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే విషయమై బండ్ల గణేష్‌తో కాంగ్రెస్‌ పెద్దలు మాట్లాడినట్లు సమాచారం. మరోవైపు NSUI నేత బల్మూరి వెంకట్ సైతం కూకట్‌పల్లి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు.

2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీకి ప్రచారం చేశారు బండ్ల గణేష్‌. ఆ ఎన్నికల్లో బండ్ల గణేష్‌ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. కాంగ్రెస్‌ తెలంగాణలో అధికారంలోకి రాకుంటే గొంతు కోసుకుంటానంటూ సవాల్ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోవడంతో.. తర్వాత ఆ మాటను వెనక్కి తీసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్‌లో అద్భుతమైన అభివృద్ధి జరిగిందంటూ ప్రశంసలు సైతం కురిపించారు.

First Published:  8 Oct 2023 3:55 AM GMT
Next Story