Telugu Global
Telangana

బండి సంజయ్ కొడుకు ఓవర్ యాక్షన్.. వైరల్ వీడియో

విద్యార్థిని కొట్టడం, తిట్టడంతోపాటు.. దాడి ఘటన బయటపెడితే చంపేస్తామంటూ బెదిరించాడు. మంత్రికి చెప్పినా తననేం పీకలేరని కూడా రెచ్చిపోయాడు బండి భగీరథ్.

బండి సంజయ్ కొడుకు ఓవర్ యాక్షన్.. వైరల్ వీడియో
X

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తనయుడు బండి సాయి భగీరథ్‌ కాలేజీలో చేసిన ఓవర్ యాక్షన్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. హైదరాబాద్ దుండిగల్ లోని మహీంద్రా యూనివర్శిటీలో చదువుతున్న భగీరథ్.. అదే కాలేజీలో ఓ విద్యార్థిని చితకబాదిన వీడియో అది. అందులో ఆ కుర్రాడి మాటలు, చేతలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. దీన్ని ర్యాగింగ్ గా పరిగణించి కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఈ వీడియోని ట్రోల్ చేస్తున్నారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ గొడవపై ట్వీట్ వేశారు.


మహీంద్రా యూనివర్శిటిలో చదువుతున్న ఓ విద్యార్థిని తీవ్రంగా కొడుతూ, తిడుతూ బండి భగీరథ్ అతడి స్నేహితులు వీడియో తీసుకున్నారు. చివరకు అది సోషల్ మీడియాలోకి ఎక్కడంతో వైరల్ గా మారింది. మహీంద్రా యూనివర్శిటీ కమిటీ ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎవరికైనా చెబితే చంపేస్తాం..

విద్యార్థిని కొట్టడం, తిట్టడంతోపాటు.. దాడి ఘటన బయటపెడితే చంపేస్తామంటూ బెదిరించాడు. మంత్రికి చెప్పినా తననేం పీకలేరని కూడా రెచ్చిపోయాడు బండి భగీరథ్. ఇలా ర్యాగింగ్, హింసకు పాల్పడేవారు తమ ప్రతాపానికి గుర్తుగా వీడియో తీసుకుంటారు. అలా వీడియో తీసిన వీరు కూడా దాన్ని ఫ్రెండ్స్ కి పంపించి గొప్పలు చెప్పుకున్నారు. చివరకు అదే వారు చేసిన తప్పుకి సజీవ సాక్ష్యంగా మారింది. ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎక్కడంతో బండి భగీరథ్ సన్నాఫ్ బండి సంజయ్ బండారం బయటపడింది.

తండ్రి అండ చూసుకునేనా..?

బండి సంజయ్‌ కొడుకు భగీరథ్ మొదటినుంచీ వివాదాస్పదుడేనని అంటున్నారు అతని ప్రవర్తన తెలిసినవారు. గతంలో ఢిల్లీలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో చదువుతూ ఇలాగే గొడవలకు దిగడంతో యాజమాన్యం అతడికి టీసీ ఇచ్చి పంపించివేసిందని తెలుస్తోంది. తాజాగా మహీంద్రా యూనివర్శిటీలో కూడా ఇలాంటి గొడవే జరిగింది. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

First Published:  17 Jan 2023 10:10 PM IST
Next Story