Telugu Global
Telangana

నేను సీఎం కావాలనుకోవట్లేదు.. బండి వేదాంతం

సీఎం సీటు ఆశించడం మూర్ఖత్వం, సీఎం సీటు ఆశించేవారంతా మూర్ఖులేనంటూ బండి సంజయ్ స్టేట్ మెంట్ ఇవ్వడం బీజేపీలో కూడా చర్చనీయాంశమైంది. ఇంతకీ బండి ఎవరిని ఉద్దేశించి ఆ స్టేట్ మెంట్ ఇచ్చారనేది తేలాల్సి ఉంది.

నేను సీఎం కావాలనుకోవట్లేదు.. బండి వేదాంతం
X

"ముఖ్యమంత్రి కావాలని నేనైతే అనుకోవట్లేదు. ముఖ్యమంత్రి కావాలనుకునేవారు, ముఖ్యమంత్రి కాలేరు కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి అనే ప్రస్తావన రాకూడదు. వస్తే, దానికంటే మూర్ఖత్వం ఆ నాయకులకు ఇంకోటి ఉండదు. ఇప్పుడే ముఖ్యమంత్రి కావాలనుకునేవాడు మూర్ఖుడు." అంటూ మీడియా సమావేశంలో తేల్చి చెప్పారు బండి సంజయ్. నిన్న మొన్నటి వరకు ఆయనే తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి అనుకున్నారు కొందరు. కానీ సడన్ గా అధిష్టానం ఆయన్ను పక్కనపెట్టింది, టీ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. దీంతో తెలంగాణ ఎన్నికల విషయంలో కూడా బండి సంజయ్ వాయిస్ వినిపించట్లేదు.

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఓడించి అధికారంలోకి రావాలని చూస్తున్నాయి కాంగ్రెస్, బీజేపీ. అధికారం చేపట్టడం అంత ఈజీ కాదని ఆ రెండు పార్టీలకు తెలుసు. ముఖ్యమంత్రి కాకపోయినా, కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థి అనిపించుకోడానికైనా కొంతమంది నేతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆమధ్య కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అంటూ సీతక్క పేరుని రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తే ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు. బీజేపీలో కూడా అలాంటి ప్రతిపాదన వస్తే కచ్చితంగా కొట్లాట మొదలవుతుంది. మొదటికే మోసం వస్తుంది. అందుకే అధిష్టానాలు జాగ్రత్తగా ఉంటాయి. అయితే రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు మాత్రం ఆ పదవిపై ఆశ కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం బండి సంజయ్ కి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడనే పదవి కూడా లేకపోవడంతో సీఎం సీటుపై ఆయనకు వైరాగ్యం వచ్చినట్టుంది.

మూర్ఖత్వం ఎలా అవుతుంది..?

సీఎం సీటు ఆశించడం మూర్ఖత్వం, సీఎం సీటు ఆశించేవారంతా మూర్ఖులేనంటూ బండి సంజయ్ స్టేట్ మెంట్ ఇవ్వడం బీజేపీలో కూడా చర్చనీయాంశమైంది. ఇంతకీ బండి ఎవరిని ఉద్దేశించి ఆ స్టేట్ మెంట్ ఇచ్చారనేది తేలాల్సి ఉంది. తనకి తాను సీఎం సీటుకి దూరంగా ఉండాలనుకుంటున్నారా..? లేక ఆశావహుల ముందరికాళ్లకు బంధం వేశారా అనేది తేలాల్సి ఉంది.

First Published:  26 Aug 2023 9:32 PM IST
Next Story