రాముడి పేరుతో మేము.. బాబర్ పేరుతో మీరు
బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ఎంపీ ఎన్నికల్లో ప్రజలు నమ్మరని చెప్పారు బండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మి ప్రజలు మోసపోయారన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రాముడి పేరుతోనే ఓట్లు అడుగుతామని తేల్చి చెప్పారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. కాంగ్రెస్ నేతలు బాబర్ పేరు చెప్పి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. అయోధ్య రాముడు బీజేపీ కార్యకర్తలకు మాత్రమే దేవుడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి. రాముడు వారసుడు నరేంద్ర మోదీనే అని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. రాముడు, బాబర్ అంటూ తన వ్యాఖ్యలతో కలకలం రేపారు.
Live :Hon'ble HM Shri @AmitShah Public Meeting at Lb Stadium #BhagyanagarWelcomesAmitShah https://t.co/vXkdW3zy3i
— BJP Telangana (@BJP4Telangana) March 12, 2024
బీజేపీ ప్రధాని అభ్యర్థి మోదీ అని, కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరని నిలదీశారు బండి సంజయ్. తెలంగాణలో బీజేపీకి ఇవ్వాల్సిన అధికారాన్ని కాంగ్రెస్ కి ఎందుకిచ్చామా అని ప్రజలు బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. 20రోజుల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు చుక్కలు చూపిస్తారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కేడర్ కు బీజేపీ వ్యతిరేకం కాదని.. ఆపార్టీ నేతలకు మాత్రమే తాము వ్యతిరేకమని చెప్పారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ఎంపీ ఎన్నికల్లో ప్రజలు నమ్మరని చెప్పారు బండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఓ అభిప్రాయానికి వచ్చారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయటానికి బీఆర్ఎస్‌కు అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అధ్వాన్నంగా ఉందని, రైతు బంధుకోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇంకో 2 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వస్తుందన్నారు బండి సంజయ్.