Telugu Global
Telangana

ఇక్కడ చంపి పాకిస్తాన్ లో పాతి పెడతాం..

భైంసా ఘటనను గుర్తు చేస్తూ చంపేస్తాం, నరికేస్తాం, ఎన్ కౌంటర్ చేస్తాం, పాకిస్తాన్ లో పాతిపెడతామంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక్కడ చంపి పాకిస్తాన్ లో పాతి పెడతాం..
X

ఆదిలాబాద్ సభలో బండి సంజయ్ విద్వేష ప్రసంగంతో రెచ్చిపోయారు. లుచ్చా నా --లు అంటూ బూతులతో రెచ్చిపోయారు. భైంసా ఘటనను గుర్తు చేస్తూ ఆదిలాబాద్ యువకులను రెచ్చగొట్టారు. మోదీ రాజ్యం, హిందూ రాజ్యం రావాలన్నారు. బండి హేట్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి విద్వేష ప్రసంగాలిచ్చే నాయకుల నోటికి తాళం వేయాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన మరుసటి రోజే ఇలాంటి ప్రసంగాలతో తెలంగాణలో మతచిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే విమర్శలు వినపడుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో వచ్చేది మోదీ రాజ్యమేనని అన్నారు బండి సంజయ్. తమ రాజ్యాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. నిజాం మెడలు వంచి హైదరాబాద్‌ కు స్వాతంత్రం తెచ్చిన ఘనత సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కు దక్కిందని, అమిత్‌ షా ఆధునిక పటేల్‌ అని చెప్పారు బండి. రాష్ట్రం బాగుపడాలంటే పేదల రాజ్యం కావాలని ధర్మానికి అడ్డా.. ఆదిలాబాద్‌ గడ్డ అని అన్నారు బండి.

బీఆర్ఎస్ కి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు బండి సంజయ్. బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు. అంతా బాగానే ఉంది కానీ జనగర్జన సభలో ఆయన ప్రసంగం మాత్రం వైరల్ గా మారింది. ముఖ్యంగా భైంసా ఘటనను గుర్తు చేస్తూ చంపేస్తాం, నరికేస్తాం, ఎన్ కౌంటర్ చేస్తాం, పాకిస్తాన్ లో పాతిపెడతామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

First Published:  10 Oct 2023 6:25 PM IST
Next Story