Telugu Global
Telangana

ఈడీ చీఫ్‌గా బండి సంజయ్‌.. మోడీకి ధన్యవాదాలు

బండి వ్యాఖ్యలకు కౌంటర్‌గా కేటీఆర్‌ ట్వీట్ చేశారు. ''మీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఈడీ చీఫ్‌గా నియమించినందుకు ధన్యవాదాలు'' అంటూ మోడీని ఉద్దేశించి సెటైరికల్‌గా ట్వీట్ చేశారు.

ఈడీ చీఫ్‌గా బండి సంజయ్‌.. మోడీకి ధన్యవాదాలు
X

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ ఎంత సీరియస్‌గా వార్నింగ్‌లు ఇస్తున్నా టీఆర్‌ఎస్ మాత్రం వాటిని కామెడీగా తీసుకుంటున్నట్టుగా ఉంది. బండి సంజయ్‌ వ్యాఖ్యలకు తాజాగా కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ కూడా అలాగే ఉంది.

సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలిచిన నేపథ్యంలో స్పందించిన బండి సంజయ్ అసలెందుకు కాంగ్రెస్ పార్టీ ఈడీ విచారణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆయన ప్రశ్నించారు. నరేంద్రమోడీ, అమిత్ షాపైనా ఆరోపణలు వచ్చాయని.. వారు వాటిని ఎదుర్కొని క్లీన్‌ చిట్‌తో బయటపడ్డారని.. అప్పుడు బీజేపీ ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయలేదంటూ బండి మాట్లాడారు. అంతటితో ఆగకుండా త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఈడీ విచారణ ఎదుర్కొంటారని బండి ప్రకటించారు.

బండి వ్యాఖ్యలకు కౌంటర్‌గా కేటీఆర్‌ ట్వీట్ చేశారు. ''మీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఈడీ చీఫ్‌గా నియమించినందుకు ధన్యవాదాలు'' అంటూ మోడీని ఉద్దేశించి సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. దేశం డబుల్‌ ఇంజిన్ మీద పరుగులు తీయడం అంటే.. దాని అర్థం మోడీ- ఈడీల కాంబినేషనేనన్న విషయం బండి సంజయ్ వ్యాఖ్యల తర్వాతే తమకు అర్థమైందని కేటీఆర్ సెటైర్ వేశారు.

రెండు కఠిన వాస్తవాలంటూ మరో ట్వీట్

కేటీఆర్‌ మరో ట్వీట్ కూడా చేశారు. దేశంలో పరిస్థితి రెండు ధృవాలుగా చీలిపోతున్న పరిస్థితిని వివరిస్తూ భారత్‌లో రెండు కఠిన వాస్తవాలంటూ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక నిరుపేదలున్న దేశంగా నైజిరియాను వెనక్కు నెట్టి భారత్‌ పేదరిక రాజధానిగా మారిందని.. అదే సమయంలో బిల్‌ గేట్స్‌ను వెనక్కు నెట్టి ప్రపంచంలోనే 4వ అత్యంత సంపన్నుడిగా అదానీ ఆవిర్భవించారని పోలుస్తూ కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

First Published:  22 July 2022 6:43 AM GMT
Next Story