జీహెచ్‌ఎంసీలో వాటిపై నిషేధం
జీహెచ్‌ఎంసీ పరిధిలో గోడలపై పోస్టర్ల, పెయింటింగ్స్, వాల్ రైటింగ్స్ రాతలను నిషేధం విధిస్తూ కమీషనర్ అమ్రపాలి ఉత్తర్వులు జారీ చేసింది
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గోడలపై పోస్టర్ల, పెయింటింగ్స్, వాల్ రైటింగ్స్ జీహెచ్‌ఎంసీ నిషేధం విధించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమీషనర్ అమ్రపాలి ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైన నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని జరిమాన విధిస్తామని హెచ్చరించారు. సినిమా వాళ్లు కూడ పర్మిషన్ తీసుకుని సినిమా వాల్ పోస్టర్లు వేయాలని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని క్లీన్‌గా ఉంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నమని అమ్రపాలి తెలిపారు.
చెరువుల ఎఫ్‌టీఎల్‌లో, బఫర్ జోన్లలోని నిర్మాణాలను తొలగించడంలో హైడ్రాకు రేవంత్ ప్రభుత్ం పూర్తి అధికారాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించేందుకు మరోసారి రీ-సర్వే చేశారు. యజమానుల నుంచి ఇంటి పత్రాలు, ఆధార్ సహా ఇతర ముఖ్య వివరాలను సేకరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేశారు. అంతేకాదు.. ఆక్రమణలను గుర్తించి మార్క్‌లు వేశారు.