Telugu Global
Telangana

ఓయూలో ధర్నాలు నిషేధం..నియంత పాలనకు నిదర్శనం : కేటీఆర్

ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్ పరిధిలో ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేయడం ఇక నిషేధం

ఓయూలో ధర్నాలు నిషేధం..నియంత పాలనకు నిదర్శనం : కేటీఆర్
X

తెలంగాణ ఉద్యమాలకు పురిటిగడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్ పరిధిలో ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేయడం నిషేధం విధిస్తూ ఓయూ రిజిస్ట్రార్ నరేశ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటమని హెచ్చరించారు. ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు మూకుమ్ముడిగా మండిపడుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని దానిని అణచివేయాలని చూస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. విద్యార్థులు తరచూ ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాల్లో పాల్గొంటోండటం, ఇలాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వడం వల్ల యూనివర్శిటీ కార్యకలాపాలు సజావుగా సాగట్లదేని, ఆటంకం కలుగుతోందని అధికారులు భావిస్తోన్నారు. పరిపాలన, విద్యాపరమైన చర్యల్లో అడుగు ముందుకు పడట్లేదని చెబుతున్నారు.

కొన్ని, కొన్ని సందర్భాల్లో భద్రతాపరమైన ఆందోళనలు సైతం తలెత్తుతోన్నాయని యూనివర్శిటీ ఉన్నతాధికారులు నిర్ణయానికొచ్చారు. ఓయూ క్యాంపస్ లో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు చేసిందని తెలంగాణ సర్కార్‌. అయితే.. దీనిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అంటూ ఫైర్‌ అయ్యారు. ఆరు గ్యారెంటీలను అటకెక్కించిన రేవంత్ సర్కారు ఏడో గ్యారెంటీకి కూడా ఏడాదిన్నరలోనే ఘోరీకట్టిందని మండిపడ్డారు.ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న ముఖ్యమంత్రి, నిరసనలపై ఉక్కుపాదం మోపడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రజాపాలనలో నిరసన తెలిపే హక్కును కాపాడాతామని అభయహస్తం మేనిఫెస్టోలోని మొదటి పేజీ, మొదటి లైన్ లోనే ఇచ్చిన హామీ ఏమైందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ కేటీఆర్ చేశారు.

First Published:  16 March 2025 1:02 PM IST
Next Story