Telugu Global
Telangana

బల్మూరి, అద్దంకిలకు బంపర్‌ ఆఫర్‌.. ఎమ్మెల్సీగా ఛాన్స్‌

ఈ ఎన్నిక కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈనెల 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 29న ఈ రెండు స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు.

బల్మూరి, అద్దంకిలకు బంపర్‌ ఆఫర్‌.. ఎమ్మెల్సీగా ఛాన్స్‌
X

ఎమ్మెల్యే కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఉపఎన్నిక కోసం అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్‌తో పాటు NSUI స్టేట్ ప్రెసిడెంట్‌ బల్మూరి వెంకట్‌లను అభ్యర్థులుగా ఫైనల్ చేసింది. ఈ మేరకు ఇద్దరికి ఇప్పటికే ఫోన్‌ ద్వారా హైకమాండ్ సమాచారం ఇచ్చింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి సీటును త్యాగం చేశారు అద్దంకి దయాకర్‌. ఇక బల్మూరి వెంకట్‌కు సైతం అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ టైమ్‌లోనే ఇద్దరికి భవిష్యత్తులో ప్రాధాన్యత ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసింది కాంగ్రెస్‌. అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, హుజూరాబాద్‌ నుంచి పాడి కౌశిక్‌ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలవడంతో.. ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి.

ఈ ఎన్నిక కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈనెల 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 29న ఈ రెండు స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఒకేసారి ఎన్నిక నిర్వహించనుండడంతో రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ ఖాతాలో చేరనున్నాయి. ఇక గవర్నర్ కోటాలోనూ రెండు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. ఒక స్థానానికి కోదండరాం దాదాపు ఖరారు కాగా.. మరో స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది.

First Published:  16 Jan 2024 12:47 PM
Next Story