Telugu Global
Telangana

ట్రెండింగ్ లో బ్యాగ్ మ్యాన్.. బీఆర్ఎస్ మార్కు ర్యాగింగ్

బ్యాగ్ అనే పేరు వినిపించేలా ఉన్న సినిమా క్లిప్పింగ్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.

ట్రెండింగ్ లో బ్యాగ్ మ్యాన్.. బీఆర్ఎస్ మార్కు ర్యాగింగ్
X

సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచే పోస్టింగ్ లు పెడుతున్నారంటూ ఇటీవల బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆమధ్య ఉస్మానియా యూనివర్శిటీ హాస్టల్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆయన సెల్ ఫోన్ కూడా సీజ్ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆయనపై మరో కేసు పెట్టారు. కాంగ్రెస్ హయాంలో ఆయనపై పెట్టిన ఏడో కేసు ఇది. అర్థరాత్రి వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అక్కడ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఉన్నారని, కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఫహీమ్ గెస్ట్ హౌస్ లో పడుకున్నారని.. క్రిశాంక్ ట్వీట్ వేయడంతో కొత్త కేసు నమోదైంది. కేసు విషయం పక్కనపెడితే ఇప్పుడీ గొడవ మరో మలుపు తిరిగింది. రేవంత్ రెడ్డి పేరెత్తకుండానే ఆయన్ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ సరికొత్తగా ట్రోలింగ్ మొదలు పెట్టింది.


వీడియోలు పెడితే కేసులు పెడుతున్నారట. అందుకే బ్యాగ్ ఫోటో మాత్రమే పెడుతున్నాం! మిత్రులారా, మీరు కూడా మీ ఫేవరెట్ బ్యాగ్ ఫోటోని #BagMan హాష్ ట్యాగ్ తో పోస్ట్ చేయండి. అంటూ బీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఓ పోస్టింగ్ పెట్టారు. ఇక చూసుకోండి ఆ హ్యాష్ ట్యాగ్ మోత మోగిపోతోంది. బీఆర్ఎస్ అభిమానులు తమకు నచ్చిన బ్యాగ్ ఫొటొని పెట్టి బ్యాగ్ మ్యాన్ అనే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తున్నారు. బ్యాగ్ అనే పేరు వినిపించేలా ఉన్న సినిమా క్లిప్పింగ్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.

ఓటుకు నోటు కేసుని తాజాగా బీఆర్ఎస్ గుర్తు చేస్తోంది. అప్పట్లో రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇంటికి క్యాష్ బ్యాగ్ తీసుకుని వెళ్లారని, ఆ సన్నివేశాన్ని గుర్తు చేస్తూ మరోసారి ఆయన్ను టార్గెట్ చేయాలనేది బీఆర్ఎస్ వ్యూహం. అంతే కాదు రేవంత్ రెడ్డి అనే పేరెత్తితే కేసులు పెడుతున్నారని ఇలా వెరైటీగా నిరసన తెలపుతున్నారు. రేవంత్ అనే పేరెత్తకుండానే బ్యాగ్ మ్యాన్ అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు కేసులెలా పెడతారో చూద్దాం అన్నట్టుగా కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఇరు పార్టీల మధ్య ఏ స్థాయిలో పోరాటం జరుగుతోందో, అదే రేంజ్ లో సోషల్ మీడియాలో కూడా వార్ నడుస్తోంది.

First Published:  1 Aug 2024 12:31 PM IST
Next Story